తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL Retention 2022: రిటెన్షన్​కు వేళాయే.. ఏ జట్టు ఎవరిని తీసుకునేనో?

IPL Retention 2022: ఐపీఎల్-2022కు సంబంధించిన మెగావేలం జనవరిలో జరగనుంది. అంతకుముందే నేడు (మంగళవారం) ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను వెల్లడించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకునే వీలుందో చూద్దాం.

IPL Retention 2022, IPL Retention 2022 live, ఐపీఎల్ రిటెన్షన్ లైవ్, ఐపీఎల్ రిటెన్షన్ లైవ్ న్యూస్
IPL

By

Published : Nov 30, 2021, 5:32 AM IST

IPL Retention 2022: ఐపీఎల్-2022 కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్​లో 10 జట్లు పాల్గొనబోతుండటమే ఇందుకు కారణం. అలాగే వచ్చే సీజన్​ కోసం జనవరిలో మెగావేలం కూడా జరగనుంది. అందుకోసం జట్లు నేడు (మంగళవారం) అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఈ కార్యక్రమం రాత్రి 9.30కు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ రిటెన్షన్ రూల్స్​తో పాటు ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకునే అవకాశం ఉందో చూద్దాం.

ప్రతి జట్టు ఎంతమందిని అట్టిపెట్టుకునే వీలుంది?

గరిష్ఠంగా ప్రతి జట్టు నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. ముగ్గురు భారత ఆటగాళ్లు లేదా ఇద్దరు విదేశీ ఆటగాళ్లను గరిష్ఠంగా తీసుకోవచ్చు. ఆ ముగ్గురు ఆటగాళ్లు క్యాప్​డ్ అయినా కావచ్చు, అన్​క్యాప్​డ్ అయినా కావచ్చు.

మెగావేలానికి ముందు ప్రతి జట్టు దగ్గర ఎంత నగదు ఉంటుంది?

మెగా వేలంలో ప్రతి జట్టు రూ.90 కోట్లు గరిష్ఠంగా ఖర్చు చేసే వీలుంది.

అట్టిపెట్టుకునే ఆటగాళ్ల కోసం జట్లు ఎంత ఖర్చు చేయవచ్చు?

అట్టిపెట్టుకునే ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఖర్చు చేసే మొత్తాన్ని రూ.90 కోట్ల నుంచి తీసుకోవాలి.

IPL Retain Player List 2022(Predicted)

  • చెన్నై సూపర్ కింగ్స్:ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ/సామ్ కరన్
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:విరాట్ కోహ్లీ, మ్యాక్స్​వెల్, చాహల్, హర్షల్ పటేల్
  • కోల్​కతా నైట్​రైడర్స్:రసెల్, నరేన్, గిల్, వెంకటేశ్ అయ్యర్
  • ముంబయి ఇండియన్స్:రోహిత్ శర్మ, బుమ్రా, ఇషాన్ కిషన్, పొలార్డ్
  • దిల్లీ క్యాపిటల్స్:రిషభ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, నోర్ట్జే
  • రాజస్థాన్ రాయల్స్:సంజూ శాంసన్, బట్లర్, బెన్ స్టోక్స్, యశస్వి జైస్వాల్
  • సన్​రైజర్స్ హైదరాబాద్:రషీద్ ఖాన్, విలియమ్సన్, ఉమ్రన్ మాలిక్
  • పంజాబ్ కింగ్స్:ఏ ఆటగాడిని తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు

ఇవీ చూడండి: మరోసారి ద్రవిడ్​ క్రీడాస్ఫూర్తి.. తటస్థ పిచ్​ కోసం పట్టుబట్టి మరీ!

ABOUT THE AUTHOR

...view details