Anil Kumble on KL Rahul: గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కు సారథిగా బాధ్యతలు చేపట్టిన ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఆ జట్టు వదులుకుంది. మెగా వేలంలోకి వెళ్లాలని రాహుల్ భావిస్తున్నాడని ఈ ఫ్రాంచైజీ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపాడు.
"మేం రాహుల్‌ను కెప్టెన్‌గా ఉంచుదామని భావించాం. అయితే అతడు మాత్రం వేలంలోకి వెళ్లాలని భావించాడు. ఆటగాడి ఇష్టం ప్రకారమే రిటెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని గౌరవించి రాహుల్‌ను వదిలేసుకున్నాం."
-అనిల్ కుంబ్లే, పంజాబ్ కోచ్
KL Rahul on Leaving PBKS: మయాంక్ అగర్వాల్, అర్ష్‌దీప్ సింగ్‌ను మాత్రమే పంజాబ్ రిటెయిన్ చేసుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ స్పందించాడు. "ఇదొక అద్భుతమైన ప్రయాణం. మీ ప్రేమకు కృతజ్ఞతలు. మరో చోట కలుద్దాం" అని పోస్ట్ చేశాడు.
ఆర్సీబీ వదిలేయడం వల్ల కేఎల్ రాహుల్‌ను పంజాబ్ కింగ్స్ 2018 వేలంలో రూ. 11 కోట్లకు కొనుగోలు చేసింది. అలానే రవిచంద్రన్ అశ్విన్ దిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిపోవడం వల్ల 2020 సీజన్‌తోపాటు 2021 సీజన్‌కు రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించింది. 2018 సీజన్‌లో 659 పరుగులు, 2019లో 593 పరుగులు, 2020లోనూ 670 పరుగులు, రెండు విడతల్లో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ (2021)లో 626 పరుగులు చేశాడు.