ఈ సీజన్ ఐపీఎల్లో వరుస ఓటములతో డీలాపడ్డ రెండుజట్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో కొత్త కెప్టెన్ విలియమ్సన్తో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. గెలుపు బాట పట్టాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కింద నుంచి తొలి రెండు స్థానాల్లో ఈ రెండు జట్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మూడు మార్పులు చేసింది. సారథిగా తప్పించిన వార్నర్‌కు తుది జట్టులో కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. సుచిత్, కౌల్‌ను కూడా పక్కనపెట్టారు. ఈ ముగ్గురు స్థానాల్లో నబి, భువి, సమద్‌ను తీసుకున్నారు. రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. ఉనదక్త్ స్థానంలో త్యాగిని తీసుకోగా.. శివమ్ దూబె స్థానంలో అనుజ్ రావత్ అరంగేట్రం చేయనున్నాడు.