వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విధ్వంసం సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సాకరియా 3, క్రిస్ మోరిస్ 2, రియాన్ పరాగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
రాహుల్, దీపక్ విధ్వంసం.. రాజస్థాన్ లక్ష్యం 222
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 221 పరుగులు చేసింది. సారథి కేఎల్ రాహుల్(91), దీపక్ హుడా(64) అర్ధ సెంచరీలతో మెరిశారు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సాకరియా 3, క్రిస్ మోరిస్ 2, రియాన్ పరాగ్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
ఓపెనర్లుగా దిగిన కేఎల్ రాహుల్(91) అర్ధ శతకంతో మెరవగా.. మయాంక్ అగర్వాల్(14) మాత్రం మూడో ఓవర్లోనే వెనుదిరిగాడు. సకారియా వేసిన ఓవర్ నాలుగో బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 22 పరుగుల వద్ద తొలివికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చి క్రిస్ గేల్(40పరుగులు 6x2,4x4) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగి.. రియాన్ పరాగ్ బౌలింగ్‌లో స్టోక్స్ చేతికి క్యాచ్ ఇచ్చి 89 పరుగులు వద్ద ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా(64) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరు సిక్సులు, నాలుగు ఫోర్లతో సునామీ సృష్టించాడు. చివరకు.. జట్టు స్కోరు 194 పరుగుల వద్ద మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్, జై రిచర్డ్సన్ డక్ ఔట్ అయ్యారు.