తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్: కోహ్లీసేనను కోల్​కతా అడ్డుకోగలదా?

బెంగళూరు, కోల్​కతా మధ్య సోమవారం సాయంత్రం మ్యాచ్ జరగనుంది.​ మ్యాచ్​లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. రాత్రి 7.30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది.

kohli, morgan
కోహ్లీ, మోర్గాన్​

By

Published : May 3, 2021, 5:31 AM IST

అహ్మదాబాద్​ వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, కోల్​కతా నైట్​రైడర్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరగనుంది.​ గత మ్యాచ్​లో పంజాబ్​పై ఓటమితో డీలాపడ్డ కోహ్లీసేన.. ఇందులో గెలిచి, పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు ఓటములతో సతమవుతోన్న కోల్​కతా​.. ఇందులో ఎలాగైనా విజయం సాధించాలని ప్రణాళిక రచిస్తోంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి?

మెరుగ్గా ఆడాలి

టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్​ల్లో ఐదు విజయాలతో ఆర్సీబీ దూసుకెళ్తోంది. అయితే గత మూడు మ్యాచుల్లో మాత్రం రెండింటిలో ఓడిపోయింది. కెప్టెన్ కోహ్లీ, పడిక్కల్​, మ్యాక్స్​వెల్​, డివిలియర్స్​ నిలకడగానే రాణిస్తున్నప్పటికీ మరింత బాగా ఆడాల్సి ఉంది. బౌలర్లు సామ్స్​, సిరాజ్​, చాహల్​, జెమీసన్, షాబాజ్ అహ్మద్​ మెరుగ్గా బౌలింగ్ చేయాలి. ఏదేమైనప్పటికీ జట్టు సమష్టి ప్రదర్శన చేస్తే కోల్​కతా​పై గెలిచి పాయింట్ల పట్టికలో ఎగబాకే అవకాశముంది.

ఫామ్​లోకి వస్తుందా?

ఈ సీజన్​ ప్రారంభంనుంచి నిలకడలేమి ప్రదర్శన చేస్తోంది కోల్​కతా నైట్​రైడర్స్​. ఓపెనర్లు రానా, గిల్​ ఫర్వాలేదనిపిస్తున్నా భారీ స్కోర్లు నమోదు చేయడంలో విఫలమవుతున్నారు. రాహుల్​ త్రిపాఠి కూడా రాణిస్తున్నప్పటికీ.. నిలకడలేమితో సతమతమవుతున్నాడు. కెప్టెన్ మోర్గాన్ ఇంతవరకు బ్యాట్​కు పనిచెప్పలేదు. మిడిలార్డర్​లో దినేశ్​ కార్తీక్​ సరిగ్గా రాణించలేకపోతున్నాడు. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి స్థిరంగా రాణిస్తున్నాడు. ఇక శివమ్​ మావి, కమిన్స్​, ప్రసిద్ధ్ కృష్ణ కూడా మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్​లాడిన కోల్​కతా జట్టు కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details