ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది కోల్‌కతా నైట్‌రైడర్స్(kolkata knight riders team). . సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చింది. నేడు (సెప్టెంబర్ 28) దిల్లీ(KKR vs DC 2021)తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది కేకేఆర్. దిల్లీ విధించిన 128 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో ఛేదించింది. మొదట ఓపెనర్ గిల్ 30 పరుగులతో రాణించగా.. నితీశ్ రానా (36*) తనదైన బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. సునీల్ నరేన్ చివర్లో 10 బంతుల్లో 21 పరుగులతో మెరిశాడు.
దిల్లీపై కోల్‌కతా విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం - దిల్లీపై కోల్‌కతా విజయం
ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లింది కోల్‌కతా నైట్‌రైడర్స్(kolkata knight riders team). దిల్లీ క్యాపిటల్స్(KKR vs DC 2021)తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్
చతికిలపడిన దిల్లీ
ఈ సీజన్లో బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన దిల్లీ క్యాపిటల్స్(delhi capitals team) బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. కోల్‌కతా బౌలర్లను కాచుకోలేక చేతులెత్తేశారు. పంత్ (39), స్మిత్ (39) రాణించగా, ధావన్ (24) పర్వాలేదనిపించాడు. వీరు మినహా మిగతా వారందరూ రెండంకెల స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. శ్రేయస్ (1), హెట్మెయర్ (4), లలిత్ యాదవ్ (0), అక్షర్ పటేల్ (0) దారుణంగా నిరాశపర్చారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులకు పరిమితమైంది దిల్లీ.