తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021 News: ఒకే ఒక జట్టుగా దిల్లీ.. ధోనీ చెత్త రికార్డు

ఐపీఎల్​ 2021(IPL 2021 News)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్(delhi capitals ipl record). తద్వారా లీగ్​లో ఓ రికార్డును నెలకొల్పింది. అలాగే ఈ మ్యాచ్​లో ధోనీ(ms dhoni stats) స్లో బ్యాటింగ్​తో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

Delhi capitals
దిల్లీ.

By

Published : Oct 5, 2021, 9:56 AM IST

ఈ ఐపీఎల్​(IPL 2021 News) సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​(delhi capitals ipl record) ఓ అరుదైన రికార్డు సాధించింది. బలమైన జట్లుగా పేరుగాంచిన ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ను​ ఒకే సీజన్​లో రెండు సార్లు ఓడించిన తొలి జట్టుగా ఘనత సాధించింది. ఐపీఎల్​ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. సోమవారం(అక్టోబర్​ 4) సీఎస్కేపై విజయం సాధించిన తర్వాత ఈ మార్క్​ను అందుకుంది.

ధోనీ చెత్త రికార్డు

దిల్లీతో జరిగిన మ్యాచ్​లో మరోసారి స్లో బ్యాటింగ్​తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు ధోనీ(ms dhoni stats). ఈ మ్యాచ్​లో ఇతడు 27 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 10 డాట్ బాల్స్ ఉన్నాయి. అలాగే 66.6 స్ట్రైక్ రేట్​తో పరుగులు సాధించాడు మహీ. లీగ్ చరిత్రలో ఇతడికిదే అతి తక్కువ స్ట్రైక్ రేట్ (తొలి 25 బంతుల్లో). ఇంతకుముందు 2008లో దక్కన్ ఛార్జర్స్​తో జరిగిన మ్యాచ్​లో 31 బంతుల్లో 74.19 స్ట్రైక్ రేట్​తో 23 పరుగులు చేశాడు.

దిల్లీ గెలిచింది

సోమవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ(dc vs csk 2021) 3 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. రాయుడు (55 నాటౌట్‌; 43 బంతుల్లో 5×4, 2×6) పోరాడడం వల్ల మొదట చెన్నై 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ (2/18), అశ్విన్‌ (1/20) చెన్నైకి కళ్లెం వేశారు. నోర్ట్జే, ఆవేష్‌ ఖాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. రబాడ 4 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చాడు. ధావన్‌ (39; 35 బంతుల్లో 3×4, 2×6), హెట్‌మెయర్‌ (28 నాటౌట్‌; 18 బంతుల్లో 2×4, 1×6) రాణించడం వల్ల లక్ష్యాన్ని దిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శార్దూల్‌ (2/13), జడేజా (2/28) గొప్పగా బౌలింగ్‌ చేసినా ఫలితం లేకపోయింది.

ఇవీ చూడండి: ముంబయి-రాజస్థాన్.. కీలకపోరులో గెలుపెవరిది?

ABOUT THE AUTHOR

...view details