ఐపీఎల్ రెండో దశ(ipl second phase schedule 2021) తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బౌలర్లు అదరగొట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. సీఎస్కే జట్టులో రుతురాజ్ గైక్వాడ్(88*) మినహా అందరూ విఫలమయ్యారు. నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. ప్రత్యర్థి జట్టు ముందు 157పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
iPL 2021: అదరగొట్టిన గైక్వాడ్.. ముంబయి లక్ష్యం 157
ఐపీఎల్ రెండో దశ(ipl second phase schedule 2021) తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో బౌల్ట్, అడం మిల్నే, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కేకు శుభారంభం దక్కలేదు. తొలి మూడు ఓవర్లలో వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది. డుప్లెసిస్(0), మొయిన్ అలీ(0), సురేష్ రైనా(4) వరుసగా పెవిలియన్ చేరారు. ఓపెనర్ గైక్వాడ్ మాత్రమే మ్యాచ్ చివరకు ఉండి స్కోరు బోర్డును నడిపించాడు. నాలుగో వికెట్‌గా వచ్చిన సారథి ధోనీ(3) కూడా నిరాశపరిచాడు. మిల్నే బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నిలకడగా ఆడుతున్న జడేజా(26) బుమ్రా బౌలింగ్‌లో పొలార్డ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన బ్రావో(23) ధనాధన్ షాట్లు ఆడి ఔటయ్యాడు. ముంబయి బౌలర్లలో బౌల్ట్, అడం మిల్నే, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు.
ఇదీ చూడండి: Ipl 2021: టాస్ గెలిచిన సీఎస్కే.. రోహిత్ లేకుండానే ముంబయి