ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ చివరి దశకు చేరుకుంది. 50 రోజులకు పైగా జరిగిన ఉత్కంఠ పోరులో 70 లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ఎవరు గెలిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగు జట్లు టైటిల్ రేసులో ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ పోటీ పడనున్నాయి. అయితే ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన లీగ్ మ్యాచ్‌లను గమనిస్తే.. 2022 జరిగిన ఓ సీన్.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లోనూ కొనసాగుతోందా అని అనిపిస్తోంది. కొన్ని గణాంకాలు చూస్తుంటే అలానే కనపడుతోంది. గుజరాత్ టైటాన్స్ విషయంలో ఇది జరుగుతోంది.
గత సీజన్‌లో ఛాంపియన్‌గా అవతరించిన గుజరాత్ టైటాన్స్.. ఆ సీజన్‌లో మొదటి మ్యాచ్ విజయంతో తమ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ప్రస్తుత సీజన్‌లోనూ కూడా అంతే. అదే సీన్‌ను రిపీట్ చేసింది. ఇక గత సీజన్‌లో 14 గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ఆడిన గుజరాత్.. ప్రస్తుత సీజన్‌లోనూ అన్నే మ్యాచ్‌లు ఆడింది. గత సీజన్‌లో లాగే 10 విజయాలు- 4 ఓటములను ఎదుర్కొని పాయింట్ల టేబుల్లో నిలవడం విశేషం.
మరో విషయమేమిటంటే.. గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ టీమ్‌కు సాధ్యం కాని ఓ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్ స్టేజీ లీగ్ మ్యాచుల్లో.. వరుస సీజన్లలో 5 కన్నా తక్కువ మ్యాచ్‌లు ఓడిన తొలి టీమ్‌గా నిలిచింది. కాగా, ఈ సీజన్‌లోనూ జోరు కొనసాగిస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్.. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి.. ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరేలా చేసింది. గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. తన మెరుపు శతకంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లపై నీళ్లు చల్లాడు. దీంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగో టీమ్‌గా ముంబయి నిలిచింది.
ప్లే ఆఫ్స్ ఇలా.. గుజరాత్ టైటాన్స్ (20 పాయింట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (17 పాయింట్లు, +0.652 నెట్‌రన్‌రేట్), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (17 పాయింట్లు, +0.284 నెట్‌రన్‌రేట్), ముంబయి ఇండియన్స్ (16 పాయింట్లు) నాలుగు స్థానాల్లో నిలిచాయి. తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లను ఆడతాయి. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న టీమ్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌ను ఆడతాయి.
- మే 23న గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగుతుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఇది జరగనుంది. ఇందులో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఓడిన జట్టుకు ఇంకో ఛాన్స్ ఉంటుంది.
- మే 24న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్- ముంబయి ఇండియన్స్ టీమ్‌లు పోటీపడతాయి. ఇందులో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌లో ఆడుతుంది. ఇది కూడా చెపాక్ స్టేడియంలోనే జరుగుతుంది.
- మే 26న క్వాలిఫయర్-2 నిర్వహిస్తారు. ఫస్ట్ క్వాలిఫయర్‌లో ఓడిన జట్టుతో.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పోటీ పడాల్సి ఉంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ రెండో క్వాలిఫయిర్ మ్యాచ్ జరుగుతుంది.
- మే 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుందిక్వాలిఫయర్ 1 గెలిచిన జట్టు-క్వాలిఫయర్ 2 గెలిచిన టీమ్.. టైటిల్ కోసం తలపడతాయి. నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఈ ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది.
- ఈ మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. జియో సినిమా యాప్‌లో ఉచితంగా చూడొచ్చు. స్టార్‌స్పోర్ట్స్‌లోనూ చూసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:Bichagadu 2 Collections : 'బిచ్చగాడు 2' జోరు.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అదుర్స్