తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: దిల్లీ క్యాపిటల్స్​లో కరోనా కలకలం - Delhi Capitals Physio Patrick Farhart

ఐపీఎల్​ దిల్లీ క్యాపిటల్స్​ టీమ్​లో ఒకరికి కరోనా సోకింది. ఫిజియో ప్యాట్రిక్‌​కు పాజిటివ్​ అని తేలినట్లు యాజమాన్యం ప్రకటించింది.

Patrick Farhar
పాట్రిక్

By

Published : Apr 15, 2022, 5:22 PM IST

Updated : Apr 15, 2022, 10:57 PM IST

Delhi capitals physio: ఐపీఎల్​లో కరోనా కలకలం రేగింది. దిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్‌హార్ట్‌కు పాజిటివ్​ అని తేలింది. ప్రస్తుతం అతడిని క్వారంటైన్​కు పంపినట్లు దిల్లీ యాజమాన్యం తెలిపింది. వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. ప్యాట్రిక్‌ను కలిసిన, సన్నిహితంగా మెలిగిన ప్లేయర్లకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఎవరికి కూడా పాజిటివ్ రాకపోవడంతో దిల్లీ మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది.

ఐపీఎల్ 2021 సీజన్‌లో సగం మ్యాచులు ఆడిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో అర్ధాంతరంగా టోర్నీని నిలిపివేశారు. యూఏఈ వేదికగా మిగతా మ్యాచ్​లను నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఈ సీజన్​లో బయో బబుల్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది బీసీసీఐ. బయో బబుల్‌లోకి బయటి వ్యక్తులను అనుమతించేది లేదని తెగేసి చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే... 7 రోజుల పాటు క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాతే తిరిగి జట్టుతో కలవాలని బీసీసీఐ తేల్చి చెప్పింది.

ఒకవేళ ఏ జట్టు అయినా క్వారంటైన్‌ పూర్తి కాకుండానే బయటి వ్యక్తులను బయో బబుల్‌లోకి అనుమతిస్తే.. రూ.1 కోటి జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని ఫ్రాంఛైజీలకు హెచ్చరించింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. నిబంధనలు ఇంత కఠిన తరం ఉన్నా.. కరోనా కేసు వెలుగు చూడడంపై బీసీసీఐ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:IPL 2022: అంచనాల్లేని 'ఆ నలుగురు' అదరగొడుతున్నారు..

Last Updated : Apr 15, 2022, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details