ఇటీవల లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలయ్యింది. దీంతో ఆడిన రెండో మ్యాచ్‌లోనూ పరాజయాన్ని చవి చూసింది. వరసు ఓటములను ఎదుర్కొంటున్న సన్‌రైజర్స్ జట్టు ఈ సీజన్‌లో ఎలగైనా గెలవాలని ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అయితే ఈ ఓటమి వల్ల అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. అది కూడా మార్క్‌క్రమ్ టీమ్‌లోకి వచ్చి కూడా మ్యాచ్ ఓడిపోవడం వల్ల మరింత నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో సన్ రైజర్స్‌పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్‌లో పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని తాను అసలు అనుకోవట్లేదని అన్నాడు.
"సన్‌రైజర్స్ జట్టు సభ్యులు ఈ సీజన్‌లో 170 నుంచి 190 పరుగులు చేస్తారని నేను అనుకోవడం లేదు. మార్క్‌క్రమ్ ఆడకపోతే వారికి ఇంకా కష్టంగా ఉంటుంది. అయితే రాహుల్ త్రిపాఠి నైపుణ్యం కలిగిన బ్యాటర్ అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ సీజన్‌లో మాత్రం అతను అనుకున్న స్థాయిలో రాణించలేడని అనిపిస్తోంది. తదుపరి మ్యాచ్‌ల్లో ఏమైనా ఆడతాడో లేదో వేచి చూడాలి." అని హర్భజన్ విశ్లేషించాడు.
మరోవైపు కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు హర్భజన్. "రాహుల్ కెప్టెన్సీ చాలా బాగుంది. అందుకే ఛేజింగ్‌లో పెద్ద షాట్లు ఆడాల్సిన అవసరం వారికి లేకపోయింది. అతడు 35 పరుగులతో రాణించగా.. కృనాల్ పాండ్య 34 పరుగులతోనే ఆకట్టుకున్నాడు. దీంతో లఖ్‌నవూ టీమ్ ఈజీగా గెలుపును సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ చాలా బోరింగ్‌గా, ఎటువంటి మజా లేకుండానే సాగింది. వీరికి పెద్దగా పరుగులేమీ లభించలేదు. వికెట్ కూడా చాలా నిదానంగా ఉంది. దీంతో బ్యాటింగ్ సమయంలోనే సన్‌రైజర్స్ సరెండర్ అయిపోయింది." అని హర్భజన్ అన్నాడు.