ఐపీఎల్ 16వ సీజన్ బరిలోకి దిగాయి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పోటీ పడుతోంది. ఇందులో భాగంగానే ముందుగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. నూతన కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం వల్ల భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ బాధ్యతలు తీకుకున్నాడు.
ఈ లీగ్‌లో సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో సత్తా చాటాలని సన్ రైజర్స్ ఉవ్విళూరుతోంది. అలాగే సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లతో బరిలోకి దిగింది. ఈ సీజన్లో జరుగుతున్న తమ మొదటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. ఇకపోతే ఇప్పటివరకు జరిగిన మొత్తం ఐపీఎల్ మ్యాచ్‌లలో హైదరాబాద్, రాజస్థాన్ల మధ్య 16 మ్యాచ్‌లు జరగ్గా.. చరో 8 మ్యాచ్‌లు గెలిచి ఇరు జట్లు సమానంగా ఉన్నాయి.
ఇక అందరి దృష్టి ఆరేంజ్ ఆర్మీలో ఉన్న హ్యారీ బ్రూక్‌పైనే ఉంది. ఎందుకంటే ఇతడు ఐపీఎల్ వేలంలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లల్లో ఒకడిగా ఉన్నాడు. బ్రూక్ ఇంగ్లండ్ తరుపున ఆడి దాదాపు అన్ని ఫార్మాట్లలో సత్తా చాటి మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:
మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్(వికెట్ కీపర్), ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), టి నటరాజన్, ఫజల్హాక్ ఫరూఖీ.