తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 SRH vs LSG : రెచ్చిపోయిన పూరన్.. హైదరాబాద్​కు మళ్లీ నిరాశే

IPL 2023 SRH vs LSG : ఐపీఎల్​ సీజన్ 16లో సన్​రైజర్స్ హైదరాబాద్, లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ మధ్య మ్యాచ్​ జరిగింది. ఈ మ్యాచ్​లో లఖ్​నవూ.. హైదరాబాద్​పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IPl 2023 Lsg vs Srh
IPl 2023 Lsg vs Srh

By

Published : May 13, 2023, 7:43 PM IST

Updated : May 13, 2023, 8:36 PM IST

IPL 2023 SRH vs LSG : సన్​రైజర్స్​ హైదరాబాద్​ ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో తేలిపోయింది. బ్యాటింగ్​లో ఫర్వాలేదనిపించినా.. పసలేని బౌలింగ్​తో లఖ్​నవూకు విజయం కట్టబెట్టింది. హైదరాబాద్​ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో లఖనవూ ఛేదించింది. స్టోయినిస్(40), మన్​కడ్(64*)​, పూరన్ (44*)ల బీభత్సం సృష్టించారు. మేయర్స్​ను (2) ఫిలిప్ ఔట్ చేశాడు. తర్వాత దూకుడు పెంచిన డికాక్ (29)ను మయంక్​ మార్కండే బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత స్టోయినిస్​తో కలిసి మన్​కండ్​ మూడో వికెట్​కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. 16 ఓవర్లో అభిషేక్ బౌలింగ్​లో రెండు సిక్సర్లతో ఊపందుకున్న స్టోయినిస్​ను ఔట్​ చేశాడు. అప్పుడే వచ్చిన పూరన్ బాదిన మూడు భారీ సిక్సర్లతో ఆ ఓవర్లో 31 పరుగులు వచ్చాయి. అప్పటి వరకూ సన్​రైజర్స్ గెలుపు మీద ఉన్న ఆశలపై పూరన్​ నీళ్లు చల్లాడు. అంతే.. సమీకరణం 24 బంతుల్లో 38గా మారింది. తర్వాత క్రమం తప్పకుండా పూరన్ బౌండరీలు బాది లఖ్​నవూకు విజయాన్ని చేరువచేశాడు. ఇక హైదరాబాద్​ బౌలర్లలో ఫిలిప్స్​, మార్కండే, అభిషేక్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో లఖ్​నవూ ఆరోసారి విజయ పతాకం ఎగరేసింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

అంతకుముందు, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్​ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అభిషేక్​ నిరాశపర్చినా.. మరో ఓపెనర్ అన్​మోల్​ప్రీత్​ 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. తర్వాత వచ్చిన త్రిపాఠి 20, కెప్టెన్​ మర్​క్రమ్ 28 వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు పారేసుకున్నారు. మిడిల్​ ఆర్డర్​లో వచ్చిన క్లాసిన్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు) చేశాడు. ఆఖర్లో, గత మ్యాచ్​ హీరో అబ్దుల్ సమద్​ ఏకంగా 4 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. లఖ్​నవూ బౌలర్లలో కెప్టెన్ కృనాల్ రెండు, యుధ్వీర్​, ఆవేశ్​, యశ్ ఠాకూర్, అమిత్​ మిశ్ర తలో వికెట్ తీశారు.

మ్యాచ్​ మధ్యలో రభస..
రెండో ఇన్నింగ్స్​లో లఖ్​నవూ బౌలర్ ఆవేశ్ ఖాన్ 19.5 బంతిని ఎత్తులో విసిరాడు. బ్యాటర్​ క్లాసిన్​ నో బాల్​కు అప్పీల్ చేయగా ఫీల్డ్​ అంపైర్ తిరస్కరించాడు. దీంతో క్లాసిన్ రివ్యూ కోరాడు. రిప్లైలో కూడా బంతి వికెట్ల పై నుంచి వెళ్తున్నా.. థర్డ్​ అంపైర్ బార్డే, ఫీల్డ్ అంపైర్ టోట్రే నిర్ణయాన్ని సమర్ధించి ఆ బంతిని లీగల్ డెలివరీగా ప్రకటించాడు. ఆశ్చర్యానికి గురైన క్లాసిన్ అంపైర్​తో మాట్లాడుతుండగా.. లఖ్​నవూ మెంటార్ గంభీర్, కోచ్​ ఆండ్రీ బౌండరీ లైన్ లోపలికి వచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆరెంజ్ ఆర్మీ అభిమానులు లఖ్​నవూ డగౌట్​లోకి నట్​, బౌల్ట్​లు విసిరుతూ.. 'కోహ్లీ..కోహ్లీ' అంటూ నినాదాలు చేశారు.

Last Updated : May 13, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details