IPL 2023 Gill Dhoni Record : గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ చరిత్రలో మరో అరుదైన ఘనత అందుకోనున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకు మాత్రమే సాధ్యపడిన ఓ రికార్డును గిల్ ఈ ఫైనల్ మ్యాచ్‌తో సమం చేయనున్నాడు. ఇది వరకు ఐపీఎల్లో మహీ తప్ప ఏ ఇతర ఆటగాడు వరుసగా మూడు ఫైనల్ మ్యాచ్‌లు ఆడలేదు. ధోనీ మాత్రమే మూడు అంతకంటే ఎక్కువ సార్లు ఐపీఎల్ ఫైనల్స్ ఆడాడు. చెన్నై తరఫున ధోనీ ఏకంగా నాలుగు సీజన్లలో (2010, 2011 , 2012, 2013) ఆడాడు. ఇందులో రెండు సార్లు చెన్నై టైటిల్ నెగ్గగా.. రెండు సార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
IPL 2023 Gill Record :ఈ క్రమంలో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే ఫైనల్లో గుజరాత్ తరఫున బరిలోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ కూడా వరుసగా మూడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ధోనీ సరసన చేరుతాడు. గతంలో 2021లో కేకేఆర్ (రన్నరప్) తరఫున, 2022లో గుజరాత్ (విన్నర్) తరఫున ఆడిన గిల్ ఆదివారం మరోసారి ఫైనల్ మ్యాచ్ బరిలో దిగనున్నాడు. అంతేకాకుండా గిల్ గతంలో ఆడిన ఫైనల్స్‌లో మంచి ప్రదర్శనే చేశాడు. 2021లో కోల్‌కతా తరఫున 51 పరుగులు, 2022లో గుజరాత్ తరఫున 45 పరుగులతో రాణించాడు.