తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023: ఆ ముగ్గురితో పోలిస్తే సామ్ కరన్​ బెటరే.. ఫ్రాంచైజీకి న్యాయం చేస్తున్నాడుగా! - rajasthan royals punjab kings match

ఐపీఎల్ 2023లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లలో ఒకడైన సామ్ కరన్​.. మిగతా వారితో పోలిస్తే కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మిగతా ప్లేయర్స్​ తమపై పెట్టిన సొమ్ముకు న్యాయం చేయలేకపోతున్నారు! ఆ వివరాలు..

sam curran
సామ్​ కరణ్​

By

Published : Apr 6, 2023, 10:20 AM IST

ఐపీఎల్‌-2023లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్​ ఒకడు. అతడిపై నమ్మకంతో 18.5 కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేసింది. ఈ ఐపీఎల్​ తాజా సీజన్​లో ఇతర ఖరీదైన ప్లేయర్స్​తో పోలీస్తే అతడే కాస్త మంచిగా రాణిస్తున్నాడు. తన కోసం వెచ్చించిన డబ్బులకు న్యాయం చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు అతడు‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పర్వాలేదనిపించే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సామ్​ కరన్​ తర్వాత పలువురు ప్లేయర్స్​ కూడా అత్యంత ధరకు అమ్ముడుపోయారు. వారిలో కామెరూన్‌ గ్రీన్​ము ముంబయి ఇండియన్స్​ రూ17.5 కోట్లకు కొనుగోలు చేయగా.. కేఎల్‌ రాహుల్​ను లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ రూ.17 కోట్లకు దక్కించుకుంది. ఇక బెన్‌ స్టోక్స్​ను చెన్నై సూపర్​ కింగ్స్​ రూ.16.25 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే వారు అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా రాణించలేపోతున్నారు. పేలవ ప్రదర్శనతో విఫలమవుతున్నారు. సామ్​ కరన్​ ఓకడే పర్వాలేదనిపిస్తున్నాడు.

అతడు కోల్​కతా నైట్​ రైడర్స్​తో జరిగిన తమ తొలి మ్యాచ్​లో 17 బంతుల్లో 26 అజేయ పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక బంతితో (1/38) చేశాడు. అలా ఆ మ్యాచ్​లో ఓ మోస్తరుగా రాణించిన అతడు.. ఏప్రిల్​ 5న రాజస్థాన్‌ రాయల్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో బాగానే రాణించాడు. ఆఖరి ఓవర్లో విజయానికి రాజస్థాన్‌కు 16 పరుగులు అవసరం కాగా.. అద్భతుంగా బౌలింగ్‌ చేసి తొలి మూడు బంతుల్లో 4 పరుగులే ఇచ్చాడు. అలా ఈ చివరి ఓవర్‌లో 16 పరుగులకు డిఫెండ్‌ చేసి తన జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు. పంజాబ్​ పెట్టిన నమ్మకానికి, సొమ్ముకు న్యాయం చేస్తు​న్నాడని కామెంట్లు చేస్తూ అతడిని ట్రెండ్ చేస్తున్నారు. అద్భుతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసిస్తున్నారు. అతడు ఇదే జోరును కొనసాగిస్తే.. పంజాబ్‌ కింగ్స్‌ ఈ సారైనా టైటిల్‌ కలను నెరవేర్చుకుంటుందని అంటున్నారు.

ఇకపోతే మొత్తంగా రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్​ నువ్వా-నేనా అన్నట్లుగా పోటీపడి మరీ ఆడాడయి. గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్​లో చివరికి​ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్​లో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌లో సారథి ధావన్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ మెరుపులు మెరిపించగా.. బంతితో నాథన్‌ ఎలిస్‌, అర్ష్‌దీప్‌ చెలరేగిపోయారు. లక్ష్య ఛేధనలో రాజస్థాన్ గట్టిగా ప్రయత్నించినప్పటికీ ఓటమి తప్పలేదు.

ఇదీ చూడండి:ధావన్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ మెరుపులు.. బౌలింగ్‌లో నాథన్‌ ఎలిస్‌, అర్ష్‌దీప్‌.. ఫొటోస్​ చూశారా?

ABOUT THE AUTHOR

...view details