సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లకు చుక్కలు చూపించింది. తొలి ఓవర్ నుంచే దంచడం మొదలుపెట్టింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లుగా దిగిన యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్ తమదైన శైలిలో రెచ్చిపోయారు. సైన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్, ఫజల్లా ఫరుకీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్ అర్ధ శతకాన్ని స్కోర్ చేసి రికార్డును నమోదు చేశారు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న బట్లర్.. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో చెలరేగిపోయాడు. అయితే హాఫ్ సెంచరీ మార్క్ దాటిన కాసేపటికే 54 స్కోర్ చేసి నటరాజన్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. జైస్వాల్ సైతం 54 రన్స్ స్కోర్ చేసి ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత మైదానంలోకి దిగిన దేవదత్ పడిక్కల్ 2 పరుగులు మాత్రమే చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
అయితే చివర్లో సన్ రైజర్స్ బౌలర్లు చెలరేగారు. నటరాజన్, ఆదిల్ రషీద్, ఫరూఖీలు తమదైన శైలిలో బౌలింగ్‌ను ప్రదర్శించారు. తొలి ఓవర్లలో 17 పరుగులు సమర్పించుకున్న నటరాజన్.. తన చివరి 2 ఓవర్లకు కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. మరోవైపు అభిషేక్ శర్మ పట్టిన సూపర్ క్యాచ్‌కు సంజూ పెవిలియన్ బాట పట్టాడు. తొలి 10 ఓవర్లలో 122 పరుగులు సమర్పించుకున్న సన్ రైజర్స్.. చివరి 10 ఓవర్లలో కేవలం 81 పరుగులు మాత్రమే ఇచ్చుకుంది. అలా 203 టార్గెట్‌కు మ్యాచ్ ముగించింది.
సంజూ ఖాతాలో మరో రికార్డు..
గతేడాది కెప్టెన్‌గా సక్సెస్ అయిన సంజూ శాంసన్ జట్టును ఆ ఏడాది జట్టును రన్నరప్‌గా నిలిపాడు. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలన్న కసితో బరిలోకి దిగి..తొలి మ్యాచ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్థసెంచరీతో ఆకట్టుకున్న శాంసన్ 55 పరుగులు చేసి ఔటయ్యాడు.
అయితే 2018 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్లో తనదైన శైలిలో ఆడి ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు సన్‌రైజర్స్‌పై 10 మ్యాచ్‌లు ఆడి 541 పరుగులు చేశాడు. ఇక 2020 ఐపీఎల్ సీజన్ నుంచి ప్రతీ సీజన్‌లోనూ తన తొలి మ్యాచ్‌లో సెంచరీ లేదా అర్ధసెంచరీ చేస్తూ రికార్డుకెక్కుతున్నాడు. 2020 సీజన్‌లో సీఎస్కేపై 74 పరుగులు, 2021లో పంజాబ్ కింగ్స్‌పై సెంచరీ (63 బంతుల్లో 119 పరుగులు), 2022లో ఎస్‌ఆర్‌హెచ్‌పై (27 బంతుల్లో 55 పరుగులు) సాధించిన సంజూ.. తాజాగా మరోసారి ఎస్‌ఆర్‌హెచ్‌పై (32 బంతుల్లో 55 పరుగులు) స్కోర్ చేశాడు.