ఐపీఎల్ 2023లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచింది. 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. బాలీవుడ్ బాద్‌షా, కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్ సందడి చేస్తూ డ్యాన్స్ వేశారు. ప్రత్యేక గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను వీక్షిస్తూ.. జట్టులో జోష్‌ను నింపారు. తమ ప్లేయర్లు బ్యాట్, బంతులతో చెలరేగినప్పుడు లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇక మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చి ఇరు జట్ల ఆటగాళ్లతో సరదగా కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో కలిసి డ్యాన్స్ వేశారు. తన సూపర్ హిట్ సినిమా పఠాన్ 'ఝూమ్ జో పఠాన్' సాంగ్ స్టెప్పులను కోహ్లీకి నేర్పించారు. విరాట్ కూడా షారుక్‌ను అనుకరిస్తూ డ్యాన్స్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.
ఆర్సీబీ చెత్త రికార్డు.. ఈ మ్యాచ్‌లో భారీ పరుగుల తేడాతో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. దిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి ఓ చెత్త రికార్డును సమం చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 125 స్కోరులోపే ఆలౌట్ అయిన టీమ్‌గా నిలిచింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ, దిల్లీ ఇప్పటివరకు చెరో 15 సార్లు 125 స్కోరులోపే వెనుదిరిగాయి. ఈ రెండు టీమ్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్(11) కేకేఆర్, ముంబయి ఇండియన్స్(9), పంజాబ్(8) సార్లు 125 స్కోరు లోపు ఆలౌట్ అయ్యాయి.