IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. బెంగళూరుకు 227 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్ డేవాన్ కాన్వే (83) దంచికొట్టాడు. శివమ్ దుబే (52) హాఫ్ సెంచరీ చేశాడు. అజింక్య రహానే (37), అంబటి రాయుడు (14) పరుగులు చేశాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(3) పేలవ ప్రదర్శన చేశాడు. మెయీన్ అలీ (19*), జడేజా (10*) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ (1), పార్వెల్ (1), విజయ్ కుమార్ (1), హసరంగ (1), హర్షల్ పటేల్ (1), మ్యాక్స్‌వెల్ (1) వికెట్లు పడగొట్టారు.
రఫ్పాడించిన డేవాన్ కాన్వే...
చైన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ డేవాన్ కాన్వే అద్భుత ప్రదర్శన చేశాడు. 6 ఫోర్లు, 6 సిక్సులతో రఫ్పాడించాడు. దాదాపు 184 స్ట్రైక్ రేట్‌తో 45 బంతుల్లో 83 పరుగులు బాదాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మయా చేస్తాడనుకున్నప్పటికీ.. కేవలం మూడు పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రహాన్... డేవిన్‌కు మంచి భాగస్వామ్యం అందించాడు. ఇద్దరు కలసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పదో ఓవరల్లో 37 పరుగులకు పెవిలియన్ చేరాడు అజింక్య రహానే. దీంతో స్కోరుకు ఇక బ్రేకులు పడతాయని అనుకున్నారంతా.. కానీ ఆ తర్వాత వచ్చిన శివమ్ దుబే చెలరేగిపోయాడు. డేవిన్తో కలసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండు ఫోర్లు, 5 సిక్సులతో చెలరేగిపోయాడు. మెరుపు షాట్లతో 27 బంతుల్లో హాఫ్ సెంచరీ (52) పూర్తి చేశాడు. 178 పరుగుల వద్ద దుబే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాయుడు, మెయీన్ అలీ, జడేజా, ధోనీ స్కోరును 226కు తీసుకెళ్లారు.