IPL 2023 RCB vs DC : శనివారం బెంగళూరు, దిల్లీ మధ్య మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని చూడడానికి పెద్ద ఎత్తున దిల్లీ వాసులు వచ్చారు. ఒక రకంగా కోహ్లీ లోకల్ బాయ్ కావడం వల్ల అతడిని చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
Kohli Delhi Address : గతంలో విరాట్ కోహ్లీ దిల్లీలో నివసించేవాడు. దిల్లీలోని పశ్చిమ్ విహార్‌లో ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు. ఆ తర్వాత గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ ఫేజ్-1లో సొంత ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్లి చేసుకున్న తర్వాత.. సంసారాన్ని ముంబయికి షిఫ్ట్ చేశాడు విరాట్. ప్రస్తుతం ముంబయి అలీబాగ్ ప్రాంతంలోని ఓ భవనంలో నివాసం ఉంటున్నాడు.
ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, కోహ్లీ కుటుంబ సభ్యులు సైతం స్టేడియానికి వచ్చారు. టీమ్ఇండియా మాజీ స్టార్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా మ్యాచ్‌ను వీక్షించాడు. తనతో పాటు తన ఇద్దరు కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్‌ను స్టేడియానికి తీసుకువచ్చాడు. వీఐపీ బాక్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను తిలకించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం వారిద్దరూ విరాట్ కోహ్లీని కలిశారు. అతనితో సరదాగా ఫొటో దిగారు. ఈ ఫొటోను ఆర్యవీర్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. గోట్ సింబల్ పక్కన లవ్ సింబల్ పెట్టి.. కోహ్లీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.