ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఉత్కంఠగా సాగింది. పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. రాజస్థాన్ ఓపెనర్లు నిరాశపరిచారు. యశస్వి(11) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ రవిచంద్రన్ అశ్విన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్(19) దూకుడుగా ఆడేందుకు యత్నంచి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్(42).. జట్టు స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కానీ నాథన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. హెట్మెయర్ 36, ధ్రువ్ జురెల్ 32 పరుగులు చేసి పోరాడినా రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. పంజాబ్ బౌలర్ నాథన్ ఎల్లిస్ 4 వికెట్లు తీసి రాజస్థాన్ జట్టు పతనాన్ని శాసించాడు.
అంతకుముందు టాస్ ఓడిన పంజాబ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, ప్రభ్‌సిమ్రన్ శుభారంభం చేశారు. ప్రభ్‌సిమ్రన్, ధావన్ వరుస షాట్లలతో అలరించారు. రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆరంభం నుంచి అదరగొట్టిన ప్రభ్‌సిమ్రన్ (60) జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించాడు. లాంగ్ఆఫ్లో జోస్ బట్లర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ప్రభ్‌సిమ్రన్ పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రజక భానుపక్సకు ధావన్ కొట్టిన బంతి తగలడంతో వెనుదిరిగాడు. అనంతరం దూకుడు ఆడేందుకు యత్నించి జితేశ్ శర్మ(27).. పరాగ్ చేతికి చిక్కాడు.