తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 : అశ్విన్​కు బిగ్​ షాక్​.. 25% ఫీజు కట్​.. సంజూ కామెంట్స్​ వైరల్​! - ఐపీఎల్​ 2023 అశ్విన్​ ఫైన్​

రాజస్థాన్​ రాయల్స్​ ఆల్​రౌండర్​ రవిచంద్రన్​ అశ్విన్​కు బిగ్​ షాక్​ తగిలింది. మ్యాచ్​లో భాగంగా అంపైర్లు బంతిని మార్చడాన్ని బహిరంగంగా విమర్శించినందుకు అశ్విన్‌ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత పడింది.

ipl 2023 rajasthan royals player ravichandran ashwin fined for breaching IPL code of conduct
ipl 2023 rajasthan royals player ravichandran ashwin fined for breaching IPL code of conduct

By

Published : Apr 13, 2023, 7:47 PM IST

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు రాజస్థాన్​ ఆల్​రౌండ్​ రవిచంద్రన్​ అశ్విన్​. ఈ మ్యాచ్​లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న అశ్విన్‌ను భారీ షాక్‌ తగిలింది. మ్యాచ్​లో భాగంగా అంపైర్లు బంతిని మార్చడాన్ని బహిరంగంగా విమర్శించినందుకు (పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో) అశ్విన్‌ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత పడింది. ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఉల్లంఘన కింద అశ్విన్‌కు ఈ జరిమానా విధించినట్లు మ్యాచ్‌ రిఫరీ జవగల్‌ శ్రీనాథ్‌ తెలిపారు.

ఇదే మ్యాచ్‌కు సంబంధించి రాజస్థాన్‌కు మరో షాక్‌ కూడా తగిలింది. స్లో ఓవర్‌రేట్‌ కారణంగా రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు కూడా రిఫరీ జరిమానా (12 లక్షలు) విధించారు. చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ మూడు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించి టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది.

సంజూ కామెంట్స్​ వైరల్​!
చెన్నై సొంత మైదానమైన చెపాక్‌లో ఆ జట్టును ఓడించడంపై రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ శాంసన్ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ అనంతరం సంజూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ధోనీ పట్ల ఉన్న విశ్వాసం, అభిమానం సంజూతో ఇలా మాట్లాడించి ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.

'చివరి రెండు ఓవర్లు ఉన్నప్పుడు.. మ్యాచ్‌ మీ చేతుల్లోనే ఉందని అనుకున్నావా?' అని సంజయ్​ మంజ్రేకర్‌ ప్రశ్నించాడు. సంజూ స్పందిస్తూ 'అస్సలు అనుకోలేదు' అని చెప్పాడు. అప్పటికే క్రీజులో ఎంఎస్ ధోనీతో పాటు రవీంద్ర జడేజా ఉన్నాడు. 12 బంతుల్లో 40 పరుగులు చేయాలి. 'ఆ వ్యక్తి (ధోనీ) క్రీజులో ఉన్నప్పుడు సేఫ్‌గా ఉన్నామని మేం అనుకోలేదు. అతడికి తప్పకుండా గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే కొన్నేళ్లుగా ఏం సాధించాడనేది మనకు తెలుసు. చివరి బంతి ముగిసే వరకు విజయం కోసం పోరాడాల్సిందే. ధోనీని అడ్డుకోవడానికి కసరత్తు కూడా ఏమి చేయలేదు. ఇక నేను బ్యాటింగ్‌లో కేవలం రెండు బంతులను మాత్రమే ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా వికెట్‌ సమర్పించుకోవడం నిరాశపరిచింది' అని సంజూ తెలిపాడు. ధోనీ కేవలం 17 బంతుల్లోనే 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details