ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించింది. ప్రత్యర్థి దిల్లీకి 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ దుమ్మురేపారు. దిల్లీ బౌలర్లలో ముఖేెశ్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. కుల్‌దీప్ యాదవ్, పొవెల్ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ శుభారంభం చేశారు. యువ బ్యాటర్ యశస్వి విజృంభించాడు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్‌లో ఐదు ఫోర్లు బాదాడు. తొలి మూడు బంతులకు హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన యశస్వి చివరి రెండు బంతులను కూడా బౌండరీలుగా మలిచాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముఖేశ్‌కుమార్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో మూడో బంతికి యశస్వి జైస్వాల్ (60) ముఖేశ్‌కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ నిరాశపరిచాడు. కుల్‌దీప్ యాదవ్ చక్కని బంతికి సంజూ(0) నార్జ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం బరిలోకి దిగిన రియాన్ పరాగ్ (7)ను పొవెల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన జోస్ బట్లర్(79) దుమ్మురేపాడు. ముఖ్‌శ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధ్రువ్(8*), హెట్మెయిర్(39*) నాటౌట్‌గా నిలిచారు. ఫలితానికి రాజస్థాన్ 199 పరుగులు సాధించింది.