ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది. ప్రత్యర్థి రాజస్థాన్‌కు 198 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓపెనర్లు అదరగొట్టారు. ప్రభ్‌సిమ్రన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(86*) అదరగొట్టాడు. రాజస్థాన్ జట్టు బౌలరల్లో అశ్విన్, చహల్ తలో వికెట్ పడగొట్టారు. జేసన్ హోల్డర్ రెండు వికెట్లు తీశాడు.
టాస్ ఓడిన పంజాబ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, ప్రభ్‌సిమ్రన్ శుభారంభం చేశారు. ప్రభ్‌సిమ్రన్, ధావన్ వరుస షాట్లలతో అలరించారు. రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆరంభం నుంచి అదరగొట్టిన ప్రభ్‌సిమ్రన్ (60) జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించాడు. లాంగ్ఆఫ్లో జోస్ బట్లర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ప్రభ్‌సిమ్రన్ పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రజక భానుపక్సకు ధావన్ కొట్టిన బంతి తగలడంతో వెనుదిరిగాడు. అనంతరం దూకుడు ఆడేందుకు యత్నించి జితేశ్ శర్మ(27).. పరాగ్ చేతికి చిక్కాడు.
స్వల్ప వ్యవధిలో పంజాబ్ మరో వికెట్‌ను కోల్పోయింది. సికిందర్ రజా (1)ను రవిచంద్రన్ అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి షారుఖ్ ఖాన్ వచ్చాడు. కానీ జాసన్ హోల్డర్ వేసిన బంతిని షాట్ కొట్టేందుకు యత్నించి లాంగాన్‌లో జోస్ బట్లర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. తర్వాత వచ్చిన సామ్ కరన్(1*) నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ శిఖర్ ధావన్(86*) ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తన మెరుపు షాట్లతో అలరించాడు. నాటౌట్‌గా నిలిచి జట్టుకు భారీ స్కోరును అందించాడు.
చహల్ కొత్త రికార్డు..
ఈ మ్యాచ్‌లో స్టార్ బౌలర్ యుజ్వేంద చహల్.. అరుదైన ఘనత సాధించాడు. లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఇదివరకు రెండో స్థానంలో ఉన్న మలింగను చహల్(171) అధిగమించాడు. చహల్ కన్నా ముందు డ్వేన్ బ్రావో 183 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. చహల్ 133 మ్యాచుల్లో 171 వికెట్లు పడగొట్టాడు.
కోహ్లీతో ధావన్ సమం..
ఈ మ్యాచ్‌లోనే పంజాబ్ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్.. మరో ఘనత సాధించాడు. లీగ్ చరిత్రలో అత్యధిక 50+ స్కోర్లు చేసిన కోహ్లీ రికార్డును సమం చేశాడు. వీరి కన్నా ముందు వార్నర్ ఉన్నాడు. అతడు 164 ఇన్నింగ్స్‌లో 60 సార్లు 50+ స్కోర్లు సాధించాడు.