తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023: బెంగళూరులో ఆగని వాన.. ఆర్​సీబీ ప్లే ఆఫ్స్​ ఛాన్స్​ గల్లంతేనా! - బెంగళూరు వాతావరణం 2023

రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరుకు వాతావరణం సహకరించేలా కనపించట్లేదు. ఆర్​సీబీ ప్లే ఆఫ్స్​కు ఇంకో అడుగు దూరంలో ఉండగా బెంగళూరులో జోరుగా వర్షం కురుస్తోంది. ఆదివారం జరిగే మ్యాచ్​లో గుజరాత్‌పై గెలిచి ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లాలని భావిస్తోంది ఆర్​సీబీ. చూడాలి మరి ఏం జరుగుతుందో..

bangalore vs gujarath match rains
బెంగళూరు గుజరాత్ మ్యాచ్ వర్షం ఆటంకం

By

Published : May 21, 2023, 6:45 PM IST

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచ్​లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలని ఆర్​సీబీ పట్టుదలతో ఉంది. అయితే ఈ ఆశలు నెరవేరే పరిస్థితి కనపడట్లేదు. బెంగళూరులో వర్షం ఇంకా ఆగకుండా కురుస్తూనే ఉంది. మ్యాచ్ మొదలయ్యే సమయానికి ఆగుతుందో లేదో అర్థం కావట్లేదు. అయితే ​ వర్షం ఆగి మ్యాచ్​ జరుగుతందనే ధీమా ఫ్రాంచైజీలో కనిపిస్తోంది. కానీ ఆర్​సీబీ అభిమానులు మాత్రం కంగారు పడుతున్నారు. మ్యాచ్‌ సమయానికి అయినా (రాత్రి 7. 30 గంటలకు) వర్షం ఆగాలని కోరుకుంటున్నారు.

కాగా, 13 మ్యాచ్​ల్లో 9 విజయాలతో ఇప్పటికే గుజరాత్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఏడు మ్యాచ్​ల్లో విజయం సాధించిన ఆర్​సీబీ.. 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న బెంగళూరుకు ఈ మ్యాచ్‌ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే బెంగళూరు ప్లేఆఫ్స్‌ బెర్తును ఖారారు చేసుకొనే వీలు ఉంది.

మ్యాచ్​పై వర్షం ప్రభావం..ఈ మ్యాచ్​ ఫలితం గుజరాత్ టైటాన్స్​పై పెద్దగా ప్రభావం ఏమీ చూపదు. కానీ ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ నెగ్గాలనుకుంటున్న ఆర్​సీబీ జట్టుకు నిరాశే మిగులుతుంది. అయితే మ్యాచ్ సమయానికి వర్షం ఆగిపోతే.. పూర్తి 20 ఓవర్లు ఆడించటానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఆట నిర్వహిస్తారు. లేదంటే ఓవర్లను కుదించి డక్​వర్త్​ లూయిస్ పద్ధతిలో విజేతను నిర్ణయిస్తారు. ఈ డక్​వర్త్​ లూయిస్ పద్ధతి బెంగళూరుకు కలిసి వస్తుందని కచ్చితంగా చెప్పలేము.

మ్యాచ్‌ జరిగే సమయానికి వర్షం నిలిచిపోతే గుజరాత్‌పై బెంగళూరు విజయం సాధించాలి. అప్పుడు 16 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ముంబయి ఫలితంతో సంబంధం లేకుండా ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ నిర్వహించటం కుదరకపోతే ఆగిపోతే.. గుజరాత్‌ (18 పాయింట్లు), బెంగళూరు (14 పాయింట్లు) జట్లకు చెరొక పాయింట్ వచ్చి చేరుతుంది. అప్పుడు గుజరాత్‌ ఖాతాలో 19 పాయింట్లు ఉంటాయి. దీంతో ఆ జట్టు స్థానంలో మార్పు ఉండదు. ఇక బెంగళూరు 15 పాయింట్లతో ముంబయి ఫలితంపైన ఆధారపడి ఉండాల్సిందే.

ప్రస్తుతం హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి (14 పాయింట్లు) ఓడిపోతేనే బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. కానీ ఆ పరిస్థితి కనపడట్లేదు. ముంబయి గెలిస్తే 16 పాయింట్లతో నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్తుతుంది.

ఇక రాజస్థాన్‌ ఆశలు కూడా ఆవిరైపోతాయి. ముంబయి, బెంగళూరు తమ చివరి మ్యాచుల్లో ఓడిపోతే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ప్లేఆఫ్స్‌లోకి వెళ్లొచ్చని ఆశపడుతున్న రాజస్థాన్‌కు నిరాశే మిగులుతుంది.

ABOUT THE AUTHOR

...view details