ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలను అందుకుంటోంది. దీంతో ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న ఆ జట్టు.. తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 9న హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోటీ పడనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఈ జట్టు.. శనివారం(ఏప్రిల్ 8) తమ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనుంది. ఈ క్రమంలోనే పంజాబ్ ప్లేయర్స్.. రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిశారు. కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌తో కలిసి ఈ ఇద్దరు క్రికెటర్లు ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోను రాహుల్ చాహర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీన్ని చూసిన నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఇకపోతే 'పుష్ప' సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. నేడు(ఏప్రిల్ 8) బన్నీ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప' సీక్వెల్‌కు సంబంధించి ఓ టీజర్‌ను రిలీజ్ చేసింది మూవీటీమ్. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సోషల్‌మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఇక వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. పంజాబ్ కింగ్స్‌పై గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది. కాగా, ఏప్రిల్ 7 లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
అల్లు అర్జున్‌తో పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్.. వైరల్‌గా కావ్య పాప రియాక్షన్! - కావ్య మారన్ రియాక్షన్ సన్‌రైజర్స్ మ్యాచ్
ఐపీఎల్ 2023లో భాగంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ వచ్చిన పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్.. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ను కలిశారు. దానికి సంబంధించిన ఫొటో చూశారా?
కావ్యా మారన్ రియాక్షన్..ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. కొత్త కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్ వచ్చినప్పటికీ లఖ్‌నవూ చేతిలో సనరైజర్స్కు మాత్రం పరాజయం తప్పలేదు. బౌలింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి సన్‌రైజర్స్ 121/8 స్కోరు నమోదు చేయగా..ఆ తర్వాత లక్ష్య ఛేదనలో లఖ్‌నవూ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. అయితే సన్‌రైజర్స్ ఓటమి అందుకున్నప్పటికీ సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ మాత్రం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారారు. ఎందుకంటే.. హైదరాబాద్ నిర్దేశించిన 122 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లఖ్‌నవూ బ్యాటర్లలో కేల్ మేయర్స్ మంచి ఫామ్‌లో ఆడాడు. అప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లోనూ అర్ధ శతకాలతో రెచ్చిపోయిన అతడు.. మరోసారి భారీ స్కోరు చేస్తాడని అనుకున్నారు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఫరూఖి వేసిన బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి అతడు మయాంక్ అగర్వాల్ చేతికి చిక్కేశాడు. దీంతో 13 పరుగులకే మేయర్స్ ఔట్ అయ్యాడు. దీంతో కావ్యా మారన్ ఆనందంతో గెంతులేసింది. ఆమె రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. కానీ చివరికి మ్యాచ్‌లో ఓడిపోవడం వల్ల ఆమె ఆనందమంతా కాసేపట్లోనే మాయమైపోయింది.
ఇదీ చూడండి:హాట్ టాపిక్‌గా 'పుష్ప' గోరు సస్పెన్స్.. దీని వెనక ఉన్న కథ ఇదేనా?