ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా మెుహాలీ వేదికగా గుజారాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. గుజరాత్ బ్యాటర్ శుభమన్ గిల్(67; 49 బంతుల్లో 7×4, 1×6) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. పంజాబ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ మరో బంతి మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శుభ్‌మన్ గిల్ 49 బంతుల్లో 67 పరుగులు.. సాహా 30 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, రబాడ, సామ్ కరన్, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు.
IPL 2023 : శుభ్‌మన్ మెరిసె.. గుజరాత్ టైటాన్స్ మురిసె - శుభమన్ గిల్ హాప్ సెంచరీ
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజారాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు షమి వేసిన తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0) రెండో బంతికే రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం వన్‌డౌన్ బ్యాటర్‌గా వచ్చి దూకుడుగా ఆడాడు మాథ్యూ షార్ట్. మంచి ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ (8) ఔటయ్యాడు. లిటిల్ వేసిన నాలుగో ఓవర్‌లో రెండో బంతికి ధావన్ అల్జారీ జోసెఫ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత షార్ట్ (36).. క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రషీద్ ఖాన్ తన తొలి ఓవర్‌లోనే షార్ట్ వికెట్ పడగొట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ (25) ఔటయ్యాడు. మోహిత్ శర్మ వేసిన 12.2 ఓవర్‌కు వికెట్ కీపర్ వృద్ధీమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తొలుత అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. అక్కడ ఫలితం గుజరాత్‌కు అనుకూలంగా వచ్చింది. తర్వాత క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స (20) ఔటయ్యాడు. అల్జారీ జోసెఫ్ వేసిన 16.5 బంతికి గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన దూకుడుగా ఆడిన సామ్ కరణ్(22) కూడా పెవిలియన్ చేరాడు. మోహిత్ శర్మ వేసిన చక్కటి బంతికి శుభమన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చిన వెనుదిరిగాడు. కాస్త స్కోరు బోర్డు పరిగెత్తించిన షారుఖ్ ఖాన్(22) రనౌటయ్యాడు. రిషి ధావన్ కూడా డకౌటయ్యాడు. హర్‌ప్రీత్ బ్రార్(*) నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా పంజాబ్ జట్టు 153 పరుగుల స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమి, లిటిల్, జోసెఫ్, రషిద్ ఖాన్ తలో ఒక వికెట్ పడగొట్టారు. మోహిత్ శర్మ రెండు వికెట్లు తీశాడు.
రబాడా కొత్త రికార్డు..
ఈ మ్యాచ్లోపంజాబ్ కింగ్స్ జట్టు స్టార్ బౌలర్ రబాడా అరుదైన రికార్డు సాధించాడు. లీగ్ చరిత్రలో వేగవంతంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. 64 మ్యాచుల్లో రబాడా ఈ ఘనత పొందాడు.