తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 : పంజాబ్​ X గుజరాత్​.. ఫస్ట్​ బ్యాటింగ్​ ఎవరిదంటే?

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా గుజరాత్​ టైటాన్స్​​, పంజాబ్​ కింగ్స్​ మధ్య మ్యాచ్​ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్​లో టాస్​ ఎవరు గెలిచారంటే?

ipl 2023 punjab kings gujarat titans match toss winner
ipl 2023 punjab kings gujarat titans match toss winner

By

Published : Apr 13, 2023, 7:02 PM IST

Updated : Apr 13, 2023, 7:24 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​లో భాగంగా గుజరాత్​ టైటాన్స్​​, పంజాబ్​ కింగ్స్​ మధ్య మ్యాచ్​ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గుజరాత్​ టైటాన్స్​ టాస్​ గెలుచుకుంది. బౌలింగ్​ ఎంచుకుంది. ప్రత్యర్థి పంజాబ్​కు బ్యాటింగ్​​ అప్పగించింది.

పంజాబ్ కింగ్స్‌లో రెండు మార్పులు
పంజాబ్ తుది జట్టులో రెండు మార్పులు చేశారు. నాథన్‌ ఎల్లిస్‌ స్థానంలో కగిసో రబాడ, సికిందర్‌ రజా ప్లేస్‌లో భానుక రాజపక్సకు అవకాశం కల్పించారు. ప్రభ్‌ సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), సామ్ కరన్, షారుఖ్‌ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, రిషి ధావన్, అర్ష్‌దీప్ సింగ్.

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్‌), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, లిటిల్.

మోహిత్‌ శర్మ అరంగేట్రం
గతంలో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ జట్ల తరఫున ఆడిన ప్లేయర్​ మోహిత్‌ శర్మ ఈ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడుతున్నాడు. పంజాబ్‌తో జరిగే నేటి మ్యాచ్‌తో అతడు గుజరాత్ తరఫున అరంగేట్రం చేస్తున్నాడు.

వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో స‌త్తా చాటిన ఈ రెండు జ‌ట్ల‌కు మూడో మ్యాచ్‌లో షాక్ త‌గిలింది. ఉత్కంఠ పోరులో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ చేతిలో గుజ‌రాత్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. య‌ష్​ ద‌యాల్ వేసిన 20వ ఓవ‌ర్‌ చివ‌రి ఐదు బంతుల్లో రింకూ సింగ్ ఐదు సిక్స్‌లు బాద‌డంతో కేకేఆర్‌ సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

సొంత గ‌డ్డ‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్.. పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ అర్ధ శ‌త‌కంతో (99 నాటౌట్) చెల‌రేగాడు. మూడు మ్యాచ్‌ల‌కు దూర‌మైన స్టార్ ఆల్‌రౌండ‌ర్ లియం లివింగ్‌స్టోన్ రాక‌తో పంజాబ్ ప‌టిష్టంగా క‌నిపిస్తోంది. ఇరు జట్ల మధ్య గతంలో రెండు మ్యాచ్‌లు జరగ్గా పంజాబ్‌, గుజరాత్‌లు చెరొక మ్యాచ్‌ను గెలుచుకున్నాయి.

మ్యాచ్​కు ముందు.. గుజరాత్‌ టైటాన్స్‌ ప్రత్యేకంగా వీడియోను విడుదల చేసింది. గుజరాత్‌ తరఫున అదరగొడుతున్న సాయి సుదర్శన్‌, అసిస్టెంట్ కోచ్ మిథన్ మన్హస్‌ మాట్లాడటంతోపాటు ఆటగాళ్ల ప్రాక్టీస్‌ వీడియోను గుజరాత్‌ టైటాన్స్ షేర్ చేసింది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ మాట్లాడుతూ.. "గత మ్యాచ్‌లో కోల్‌కతాతో అహ్మదాబాద్‌ వేదికగా మ్యాచ్‌ ఆడాం. ఇప్పుడు మొహాలీలో ఆడేందుకు సిద్ధమవుతున్నాం. పరిస్థితులను త్వరగా అర్థం చేసుకొనేందుకు ప్రయత్నిస్తాం. అయితే, మా విధానంలో మాత్రం మార్పు ఉండదు. దూకుడును కొనసాగిస్తాం. గత మూడు మ్యాచుల్లోనూ ఇలానే ఆడాం. కోల్‌కతా చేతిలో ఓడిపోయినప్పటికీ.. ఎన్నో విషయాలను మేం నేర్చుకోగలిగాం" అని చెప్పాడు.

Last Updated : Apr 13, 2023, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details