తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023: సూర్య, గ్రీన్ ​కమ్​బ్యాక్ అదిరిందిగా.. ఇక ఫామ్​లోకి వచ్చినట్టేనా? - ముంబయి పంజాబ్​ ఐపీఎల్​

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ 2023లో పంజాబ్ కింగ్స్​ ముంబయి ఇండియన్స్​ మధ్య శనివారం జరిగిన పోరులో పంజాబ్​ గెలిచింది. స్వల్ప తేడాతో ముంబయి ఓడినప్పటికీ.. ఆ జట్టులో ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. ముఖ్యంగా పేలవ ఫామ్​తో సతమతమవుతున్న సూర్యకుమార్​ యాదవ్​, కెమరూన్ గ్రీన్​ మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఆ వివరాలు..

surya green back to form
surya green back to form

By

Published : Apr 23, 2023, 11:19 AM IST

ముంబయిలో స్టార్​ ప్లేయర్లకు కొదువలేదు. వేలం ఏదైనా... అత్యుత్తమ ఆటగాళ్లను కొనుగోలు చేస్తుంది. వేలం సమయంలో లౌక్యం ప్రదర్శించి అప్పుడప్పుడు ఆటగాళ్ల ధరను కూడా అమాంతం పెంచి బిడ్డింగ్ నుంచి తప్పుకున్న సందర్భాలూ ఉన్నాయి. అలాంటి ముంబయి యాజమాన్యం 23 ఏళ్ల ఆస్ట్రేలియన్ ఆల్​రౌండర్​ కామెరూన్​ గ్రీన్​ను ఏకంగా రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది. ముంబయి అంత మొత్తం వెచ్చించి గ్రీన్​ను కొనడంతో అతడిపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.అయితే భారీ అంచనాలతో బరిలోకి దిగిన గ్రీన్.. ఈ సీజన్​లో మొదట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో 17 కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా అయ్యాయంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి జట్టుతో కప్​ కొట్టేది ఎలా అంటూ ముంబయి ఫ్యాన్స్​ నిరాశపడ్డారు.

విమర్శించిన నోటనే ప్రశంసలు..అయితే గ్రీన్​ దండగా అన్న ముంబయి అభిమానులే గత రెండు ఇన్నింగ్సుల్లో అతడి ఆటతీరు చూసి పండగ చేసుకుంటున్నారు. గతవారం హైదరాబాద్​తో మ్యాచ్​తో ఫామ్​లోకి వచ్చిన గ్రీన్​ శనివారం పంజాబ్​పై అదే జోరు కొనసాగించాడు. సన్​రైజర్స్​పై 64 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్​ గాలివాటం కాదు అన్నట్టుగా నిన్నటి మ్యాచ్​లో 67 పరుగులతో జట్టును విజయం అంచుల దాకా తీసుకొచ్చాడు. అటు బౌలింగ్​లోనూ రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ సీజన్​లో 5 వికెట్లు పడగొట్టాడు. 166 పరుగులు తీశాడు.

ఫామ్​లోకి ​సూర్యభాయ్ ​..తన భీకరమైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లను చెమటలు పట్టించే సూర్య... గత కొద్ది కాలంగా పేలవ ఫామ్​ను కొనసాగిస్తున్నాడు. ఈ ఐపీఎల్​ సీజన్​లో కూడా మొదటి నుంచి తనదైన శైలిలో బ్యాటింగ్ చేయకండా విఫలమవుతూ వస్తున్నాడు. దీంతో ముంబయి అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. "ఏంటి సూర్య.. నువ్వేనా ఇలా ఆడేది" అంటు సోషల్ మీడియాలో ఫైరయ్యారు. మిస్టర్​ 360 గా పేరొందిన సూర్య.. డక్​ కౌట్​లకు కేరాఫ్ అడ్రస్​గా మారుతున్నాడా.. అన్నంత సందేహం నెలకొంది అందరిలోనూ. అయితే గతరాత్రి పంజాబ్​పై ఛేదనలో రోహిత్​ ఔటవగానే క్రీజులోకి ఎంట్రీ ఇచ్చాడు సూర్య.. అంతే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వచ్చీ రావడంతోనే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కొండంత లక్ష్యం చిన్నదయిపోతుందన్న రేంజ్​లో ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేశాడు. 26 బంతుల్లోనే 3 సిక్సర్లు.. 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. స్టేడియం అంతా సూర్యా.. సూర్యా...నామంతో హోరెత్తిపోయింది.. చివర్లో అర్షదీప్​ బౌలింగ్​లో క్యాచ్​గా వెనుదిరిగాడు. సూర్య ఔట్​తో పంజాబ్​ బౌలర్లు ఊపిరిపీల్చుకున్నారు. ఆఖర్లో టిమ్​ డెవిడ్​ పోరాడినా మరో ఎండ్​లో వికెట్లు పడటంతో పంజాబ్​ గెలుపొందింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details