ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా జరిగిన 31వ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసింది. కెమరూన్ గ్రీన్(67; 43 బంతుల్లో 6x4, 3x6), సూర్యకుమార్ (57; 26 బంతుల్లో 7×4, 3×6) హాఫ్ సెంచరీలతో మెరిసినా ఫలితం దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ(44; 27 బంతుల్లో 4x4, 3x6) బ్యాట్ ఝుళిపించాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలెట్టినా క్రమంగా చక్కని షాట్లతో అలరించాడు. ఇషాన్ కిషన్(1) విఫలమయ్యాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ అద్భుతంగా బంతులు సంధించాడు. పరుగుల వరద పారిన పోరులో అతడు కేవలం 29 పరుగులు సమర్పించుకుని 4 వికెట్లు తీశాడు. లియామ్ లివింస్టోన్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీశాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్‌లో పంజాబ్ బ్యాటర్లు దంచికొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. సామ్ కరన్ (55; 29 బంతుల్లో 4x4 ఫోర్లు, 2x6), హర్‌ప్రీత్ సింగ్ భాటియా (41; 28 బంతుల్లో 4x4, 2X6) దూకుడు ఆడి ఆకట్టుకున్నారు. చివర్లో జితేశ్ శర్మ (25, 7 బంతుల్లో 4x6) మెరుపులు మెరిపించాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ (26), అథర్వ తైడే (29) పర్వాలేదనిపించారు. చివరు ఐదు ఓవర్లలో 96 పరుగులు తమ ఖాతాలో వేసుకున్నారు. ముంబయి బౌలర్లలో కామెరూన్ గ్రీన్, పీయూష్ చావ్లా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అర్జున్ తెందుల్కర్, బెరెన్డర్స్, జోఫ్రా ఆర్చర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.