ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ పేరు చెప్పగానే క్రికెట్ అభిమానుల్లో పూనకాలు వస్తాయి. అయితే ఈ మెగాటోర్నీలో ముంబయి ఇండియన్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ టీమ్‌కు సాధ్యం కాని రీతిలో ఏకంగా ఐదు సార్లు ట్రోఫీని ముద్దాడి బలమైన జట్టుగా అవతరించింది. కానీ గత సీజన్లో మాత్రం పూర్తిగా విఫలమై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే ప్రస్తుతం ఆసక్తిగా సాగుతున్న తాజా సీజన్లోనూ మార్చి 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓడి.. ఓటమితో సీజన్‌ను ఆరంభించింది. ముంబయి జట్టులో హైదారాబాద్ కుర్రాడు తిలక్ వర్మ మినహా ఎవరూ రాణించలేకపోయారు.
అయితే ఐపీఎల్లో ఆడిన తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం ముంబయి ఇండియన్స్ జట్టుకు కొత్తేం కాదు. గత పదేళ్లుగా ఆ జట్టుకు ఇలా ఫస్ట్ మ్యాచులో ఓడిపోపడం అలవాటుగా మారిపోయింది. 2013 నుంచి ఆ టీమ్.. ఐపీఎల్లో ఆడిన తమ తొలి మ్యాచ్‌ను గెలవలేదు. ఓటమితోనే సీజన్లను ఆరంభించింది. అభిమానులు కూడా.. తొలి మ్యాచ్‌ను దేవుడికి ఇచ్చేయడం అలవాటే అంటూ సోషల్‌మీడియాలో ట్రోల్ కూడా చేస్తుంటారు.
2013లో ముంబయి ఇండియన్స్.. బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో ఓటమిని అందుకుంది. కానీ ఆ సీజన్ ముంబయి.. తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. 2014, 2015లో మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఆ రెండు సీజన్లోనూ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడిన ముంబయి... రెండు సార్లు ఓడిపోయింది. అయితే 2015లో మాత్రం టైటిల్‌ను దక్కించుకుంది.