తెలంగాణ

telangana

ETV Bharat / sports

MI Vs CSK: 'ఛాంపియన్స్​' మధ్య మ్యాచ్​.. టాస్​ ఎవరు గెలిచారంటే?

ఐపీఎల్ 2023లో భాగంగా దిగ్గజ టీమ్​లు ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య తొలి మ్యాచ్​ ప్రారంభమైంది. ఈ మ్యాచ్​లో టాస్​ ఎవరు గెలిచారంటే?

ipl 2023 mumbai indians chennai super kings match toss won
ipl 2023 mumbai indians chennai super kings match toss won

By

Published : Apr 8, 2023, 7:02 PM IST

Updated : Apr 8, 2023, 7:24 PM IST

IPL 2023 : ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ 16 సీజన్​లో భాగంగా దిగ్గజ టీమ్​లు ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య మ్యాచ్​ ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో చెన్నై​ జట్టు టాస్​ గెలిచింది. బౌలింగ్​​​ ఎంచుకుంది. ప్రత్యర్థి​ జట్టు ముంబయికి బ్యాటింగ్​ అప్పగించింది.

తుది జట్లు
ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్‌ కిషన్ (వికెట్‌ కీపర్), సూర్యకుమార్‌ యాదవ్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్‌ డేవిడ్‌, హృతిక్ షోకీన్, పీయూశ్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌, అర్షద్‌ ఖాన్‌, స్టబ్స్​.

చెన్నై: ఎంఎస్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), డేవన్ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్, అజింక్య రహెనే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, దీపక్ చాహర్, మిచెల్‌ సాంట్నర్, సిసింద మగళ, తూషార్​ దేశ్​పాండే, డ్వైన్​ ప్రీటోరస్​.

ఓటమితోనే
ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్ ఈ సీజన్‌ను ఓటమితోనే ఆరంభించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ చేతిలో పరాజయంపాలైంది. అయితే, రెండో మ్యాచ్‌లో లఖ్‌నవూను చిత్తు చేసినప్పటికీ.. తనదైన స్థాయిలో మాత్రం విజయం సాధించలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసి 200కిపైగా పరుగులు చేసినా.. పోరాడి మరీ 12 పరుగుల తేడాతోనే గెలిచింది. బ్యాటింగ్‌లో రుతురాజ్‌, డేవన్‌ కాన్వే, ఎంఎస్ ధోనీ, మొయిన్‌ అలీ రాణిస్తున్నారు. బౌలింగ్‌లో మాత్రం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన తుషార్‌ దేశ్‌ పాండే నిరాశపరిచాడు. ప్రత్యర్థిని కట్టడి చేసే క్రమంలో ఎక్స్‌ట్రాల రూపంలో భారీగా పరుగులు సమర్పించడం చెన్నై బౌలర్లకు రెండు మ్యాచుల్లోనూ అలవాటుగా మారిపోయింది.

ఇక టాప్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పూర్తిస్థాయిలో ఇంకా విజృంభించడం లేదు. మరో స్టార్‌ బెన్‌స్టోక్స్ అయితే బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలం కావడం చెన్నై అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే రెండో మ్యాచ్‌లో బెన్‌ స్టోక్స్‌ గాయపడ్డాడని, పది రోజుల వరకు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని సమాచారం. ఇక అంబటి రాయుడు, శివమ్‌ దూబే గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వలేదు. భారీ ఆశలు పెట్టుకున్న దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించడం ఆందోళన కలిగించే అంశం.

రోహిత్ సేన పరిస్థితి ఇదీ..
ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ముంబయి ఇండియన్స్‌కు గత సీజన్‌ కలిసిరాలేదు. ఇప్పుడు కూడా తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో రోహిత్‌ సేన చిత్తయింది. బ్యాటింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించిన ముంబయి.. బౌలింగ్‌లో మాత్రం డీలా పడింది. సీనియర్‌ బౌలర్ బుమ్రా లేకపోవడం ముంబయికి లోటు. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌, జోఫ్రా ఆర్చర్‌ ప్రభావం చూపలేకపోయారు. సీనియర్ పీయూష్ చావ్లా ఇంకా తనలో సత్తా ఉందని చాటి చెప్పడం విశేషం. ఆసీస్‌ ఆల్‌ రౌండర్ కామెరూన్ గ్రీన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయాడు. గత రెండు సీజన్ల నుంచి జట్టుతోపాటు ఉంటున్న అర్జున్‌ తెందూల్కర్‌కు ఈసారైనా అవకాశం వస్తుందో లేదో వేచి చూడాలి.

ముంబయి బ్యాటింగ్‌ విషయానికొస్తే.. యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మ అద్భుత పోరాటం చేశాడు. రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కామెరూన్ గ్రీన్‌, టిమ్‌ డేవిడ్‌ వంటి హేమాహేమీలు విఫలమైన చోట తిలక్‌ సూపర్ బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గత నాలుగు నెలల నుంచి జాతీయ జట్టు తరఫున ఆడిన వన్డేల్లో విఫలమైన సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రోహిత్ కూడా తన బ్యాట్‌ను ఝుళిపించాల్సిన సమయం ఆసన్నమైంది. కీలక ఆటగాళ్లు రాణించకపోతే మాత్రం గత సీజన్‌ ఫలితమే మరోసారి పునరావృతమయ్యే అవకాశాలు లేకపోలేదు.
చెన్నై, ముంబయి ముఖాముఖిగా 34 మ్యాచుల్లో తలపడగా.. ముంబయి 20 సార్లు, చెన్నై 14 మ్యాచుల్లో విజయం సాధించింది.

Last Updated : Apr 8, 2023, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details