11 రోజులు.. 264 గంటల ఎదురు చూపుకు తెరదింపుతూ ఆ ప్లేయర్ ఎట్టకేలకు రివెంజ్ తీసుకున్నాడు. ధోని స్టైల్‌లో ఫినిషింగ్ ఇచ్చి మ్యాచ్‌ను గెలుపొందేలా చేశాడు. అతనే ముంబయి ఇండియన్స్‌కు చెందిన బ్యాటర్ తిలక్ వర్మ. ఈ 20 ఏళ్ల తెలుగు కుర్రోడు.. ప్రత్యర్ధి గడ్డపై తన దైన స్టైల్‌లో విజృంభించి జట్టు గెలుపుకు సహకరించాడు. ఈ ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచి ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రెండుసార్లు మ్యాచ్ జరిగింది. ఏప్రిల్ 22న వాంఖడే స్టేడియం వేదికగా ఓ సారి పోరు జరగింది. అందులో చివరి ఓవర్‌కు ముంబయి విజయం సాధించాలంటే వారికి 16 పరుగులు స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది.
కానీ అదే సమయానికి అర్షదీప్ బౌలింగ్ చేస్తుండగా.. క్రీజులో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తిలక్ వర్మ ఉన్నాడు. అయితే తిలక్ కేవలం 4 బంతులను మాత్రమే ఎదుర్కొని 3 పరుగులు స్కోర్ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో అతను నెటిజన్లకు టార్గెట్ అయ్యి ట్రోటింగ్స్ను ఎదుర్కొన్నాడు. అయితే బుధవారం మొహాలీ వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మరోసారి మ్యాచ్ జరిగింది. అయితే ఈసారి మాత్రం తిలక్ వర్మ.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఓ సూపర్ సిక్స్ కొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అలా పంజాబ్ నిర్దేశించిన ఆ 215 పరుగుల లక్ష్యాన్ని ముంబయి 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సాధించింది. ఈ క్రమంలో 75 పరుగులను స్కోర్ చేసిన ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తిలక్ వర్మ చివరి 10 బంతుల్లో అజేయంగా 26 పరుగులను చేసి మ్యాచ్ విన్నర్ అయ్యాడు.