తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023: అదరగొట్టిన మేయర్స్, మార్క్​వుడ్.. లఖ్​నవూ చేతిలో దిల్లీ చిత్తు - లఖ్​నవూపై దిల్లీ క్యాపిటల్స్ విజయం

ఐపీఎల్​ 2023లో భాగంగా మూడో మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్‌పై.. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Lucknow Super Giants vs Delhi Capitals
IPL 2023: లఖ్​నవూ వర్సెస్​ దిల్లీ క్యాపిటల్స్​.. విజేత ఎవరంటే?

By

Published : Apr 1, 2023, 10:58 PM IST

Updated : Apr 2, 2023, 6:41 AM IST

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుపై 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లఖ్‌నవూ నిర్దేశించిన 194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో.. దిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌ (56; 48 బంతుల్లో 7 ఫోర్లు) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. రిలీ రోసోవ్ (30) ఫర్వాలేదనిపించాడు. పృథ్వి షా (12), మిచెల్​ మార్ష్​ (0), సర్ఫరాజ్​ ఖాన్ (4), పావెల్​ (1), హకీమ్​ ఖాన్ (4), అక్షర్​ పటేల్ (16)​, చేతన్​ సకారియా (4), కుల్దీప్​ యాదవ్​ (6*), ముకేశ్​ కుమార్ (0*) పరుగులతో పేలవ ప్రదర్శన చేశారు. ఇక, దిల్లీ బౌలర్లలో.. మార్క్‌ వుడ్ 14 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్​ చేసిన లఖ్​నవూ సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్(73; 38 బంతుల్లో 2x4, 7x6).. విరుచుకుపడ్డాడు. అయితే సెంచరీ చేస్తాడని అనుకున్న సమయంలో అతడిని అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. మేయర్స్ ఔట్ అవ్వగానే స్కోరు బోర్డు నెమ్మదిగా నడిచింది. క్రీజులోకి వచ్చినవారు వరుసగా ఫెయిల్ అయ్యారు. నికోలస్ పూరన్(36; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మాత్రం కాసేపు క్రీజులో నిలబడి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. చివర్లో ఆయుష్ బదోని(18; 7 బంతుల్లో 2x6, 1x4) కాస్త రాణించడంతో.. లఖ్​నవూ 193 పరుగుల వద్ద వెనుదిరిగింది. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు తీశారు. అక్సర్, కుల్దీప్​ చెరో వికెట్ పడగొట్టారు.

ఆరెంజ్​ పోరు నేడే..
2016లో ఛాంపియన్స్‌.. వరుసగా నాలుగేళ్లు ప్లేఆఫ్స్‌.. ఇదీ సన్​రైజర్స్​ హైదరాబాద్​ చరిత్ర. కానీ గత రెండు సీజన్‌లలో ఘోరంగా వైఫల్యం చెందింది. గత సీజన్​లో 10 జట్లలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అంతకుముందు 8 జట్లలో చిట్టచివరి ర్యాంకుకు పరిమితమైంది. ఐపీఎల్‌లో గత ఏడు సీజన్​లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రస్థానమిది. ఈ నేపథ్యంలో సరికొత్త సన్‌రైజర్స్‌ జట్టు.. 2023 సీజన్‌కు సిద్ధమైంది. కొత్త కెప్టెన్‌.. సరికొత్త కూర్పుతో కనిపిస్తున్న సన్​రైజర్స్​ టీమ్​.. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.

ఇదీ చూడండి :IPL 2023: అదిరిపోయే అరంగేట్రం.. ఐపీఎల్ చరిత్రలో నాలుగో ప్లేయర్​గా...

Last Updated : Apr 2, 2023, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details