ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. ప్రత్యర్థి పంజాబ్‌కు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లఖ్‌నవూ బ్యాటర్లలో కెప్టెన్ రాహుల్(74) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. రబాడా రెండు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, సికందర్ రజా చెరో ఒక వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ జట్టుకు ఓపెనర్లు కైల్ మేయర్స్, కేఎల్ రాహుల్ శుభారంభం చేశారు. నిలకడగా ఆడుతున్న రాహుల్, మేయర్స్ జోడీని హర్‌ప్రీత్ బ్రార్ విడదీశాడు. అతడు వేసిన 7.4 ఓవర్‌కు కైల్ మేయర్స్ (29) హర్‌ప్రీత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. సికిందర్ రజా తన తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. అతడు వేసిన 8.4 ఓవర్‌కు దీపక్ హుడా (2) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కృనాల్ పాండ్య (18) ఔటయ్యాడు. రబాడ వేసిన 14.2 ఓవర్‌కు షారూక్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత లఖ్‌నవూ కీలకమైన వికెట్ కోల్పోయింది. రబాడ వేసిన 14.3 ఓవర్‌కు నికోలస్ పూరన్ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.