రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. బంతిని ఛేజ్ చేసే క్రమంలో తొడ కండరాలు పట్టేయడం వల్ల మ్యాచ్ మధ్యలోనే మైదానన్ని వీడాడు. తీవ్రంగా నొప్పితో విలవిలలాడాడు.
బెంగళూరు ఇన్నింగ్స్ రెండో ఓవర్ లాస్ట్ బాల్‌కు డుప్లెసిస్ షాట్ బాదగా.. దానిని ఛేజ్ చేసే క్రమంలో ఒక్క సారిగా కింద పడిపోయాడు రాహుల్. నొప్పిని తట్టుకోలేక మైదానంలోనే విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజయోలు వచ్చి అతడిని పరీక్షించారు. అతడిని అక్కడిని తరలించేందుకు స్ట్రెచర్‌ను కూడా తీసుకొచ్చారు. కానీ కొద్దిసేపటికి అతడు తన సహచరుల సాయంతో మైదానాన్ని వీడాడు. రాహుల్ పరిస్థితి ఎలా ఉందో స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అతడిని స్కానింగ్ కోసం సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అతడి గాయం తీవ్రత గురించి తెలియాల్సి ఉంది. అతడు వీడడం వల్ల.. కృనాల్ పాండ్యా.. లఖ్‌నవూకు సారథం వహిస్తున్నాడు.
దూరమయ్యే అవకాశం.. కేఎల్ రాహుల్ గాయం తీవ్రత ఎక్కువైతే మాత్రం అతడు.. మిగిలిన ఐపీఎల్ మ్యాచులకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే జూన్‌లో ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆ పోరు కోసం బీసీసీఐ జట్టు కూడా ప్రకటించింది. అందులో రాహుల్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు తగిలిన గాయం తీవ్రత ఎక్కువైతే ఉంటే మాత్రం.. అతడు ఆ మ్యాచ్‌కు కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్, జస్ప్రిత్ బుమ్రా, రిషభ్ పంత్.. గాయాల వల్ల ఆటకు కొద్ది కాలం పాటు దూరమైన సంగతి తెలిసిందే.