తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ ఖాతాలో ఎవరికీ సాధ్యం కాని రికార్డ్.. కానీ RCBకి మరో షాక్​

లఖ్​నవూపై ఓడిపోయి బాధలో ఉన్న ఆర్సీబీకి మరో షాక్​ తగిలింది. అయితే ఆ జట్టు స్టార్ బ్యాటర్​ మాత్రం కోహ్లీ మాత్రం ఈ మ్యాచ్​తో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వివరాలు..

IPL 2023  LSG  vs RCB captain faf du plessis fined 12 lakh after loss and kohli completes his IPL 46 IPL half century on all franchises
ఓటమి బాధలో ఉన్న RCBకి మరో షాక్​.. కానీ కోహ్లీ ఖాతాలో ఎవరికీ సాధ్యం కాని రికార్డ్​

By

Published : Apr 11, 2023, 10:55 AM IST

Updated : Apr 11, 2023, 6:38 PM IST

ఇండియాన్​ ప్రీమియర్ లీగ్​ హిస్టరీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్​ విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం ఆడుతున్న తొమ్మిది యాక్టివ్‌ టీమ్స్‌పై అర్ధ శతకాలు బాదిన ఏకైక ప్లేయర్​గా నిలిచాడు. ఐపీఎల్‌ 16వ ఎడిషన్​లో భాగంగా సోమవారం లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకంతో రాణించిన విరాట్​.. ఈ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు.

లఖ్​నవూ సూపర్ జెయింట్స్​తో మ్యాచ్‌కు ముందు మిగిలిన ఎనిమిది ఫ్రాంచైజీలపై హాఫ్ సెంచరీలు చేశాడు కోహ్లీ. అలానే తాజా మ్యాచ్​లోనే ఓ అర్ధ శతకం బాదాడు. ఇది అతడికి ఐపీఎల్‌ కెరీర్‌లో 46వది కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 44 బాల్స్​ను ఎదుర్కొన్న కోహ్లీ 4x6, 4x4 సాయంతో 61 పరుగులు సాధించాడు.

ఐపీఎల్‌ టీమ్స్‌పై కోహ్లీ బాదిన హాఫ్​ సెంచరీలు..

చెన్నై సూపర్ కింగ్స్ - 9

దిల్లీ క్యాపిటల్స్‌ - 8

ముంబయి ఇండియన్స్ - 5

కోల్‌కతా నైట్ రైడర్స్ - 5

రాజస్థాన్ రాయల్స్ - 4

సన్‌రైజర్స్ హైదరాబాద్ - 4

గుజరాత్ లయన్స్ - 3

పంజాబ్ కింగ్స్ - 3

రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్​ - 3(నో యాక్టివ్​)

డెక్కన్ ఛార్జర్స్ - 3(నో యాక్టివ్​)

గుజరాత్ టైటాన్స్ - 2

లఖ్​నవూ సూపర్ జెయింట్స్ - 1

పూణె వారియర్స్ - 1(నో యాక్టివ్​)

కొచ్చి టస్కర్స్ - 0(నో యాక్టివ్​)

ఆర్​సీబీ కెప్టెన్​కు షాక్​.. రూ.12 లక్షల ఫైన్​..
లఖ్​నవూ చేతిలో ఓటమి బాధలో ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు టీమ్​కు మరో షాక్‌ కూడా తగిలింది. బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ మ్యాచ్​లో స్లో ఓవర్‌ రేటు కారణంగా ఫైన్‌ విధించినట్లు నిర్వాహకులు తెలిపారు. "చిన్నస్వామి స్టేడియంలో లక్​నవూ సూపర్‌ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా ఫైన్​ విధించాం. కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌కు రూ.12 లక్షల రూపాయలు జరిమానా విధించాం" అని ఐపీఎల్‌ అధికారిక ప్రకటన చేసింది. ఇక చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ తేడాతో లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని.. పూరన్​ చెలరేగి ఆడటంతో లఖ్​నవూ ఛేదించింది. దీంతో ప్రస్తుతం గెలుపు సంబరాల్లో ఎంజాయ్ చేస్తోంది.

ఇదీ చూడండి:RCB VS LSG: థ్రిల్లింగ్ లాస్ట్‌ ఓవర్‌.. నరాలు తెగే ఉత్కంఠ.. ప్లేయర్ల ధనాధన్ ఇన్నింగ్స్​ ఫొటోస్

Last Updated : Apr 11, 2023, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details