తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023: బెంగళూరు X కోల్​కతా.. టాస్​ ఎవరు గెలిచారంటే? - ఐపీఎల్​ కోల్​కతా మ్యాచ్​

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, కోల్​కతా నైట్​ రైడర్స్​ మధ్య రసవత్తరమైన పోరు ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్​లో టాస్​ ఎవరు గెలిచారంటే?

ipl 2023 kolkata night riders royal challengers match
ipl 2023 kolkata night riders royal challengers match

By

Published : Apr 6, 2023, 7:03 PM IST

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఈ సీజన్‌ను మాత్రం ఓటమితో ప్రారంభించింది. పంజాబ్‌ చేతిలో పరాజయం పాలైన కోల్‌కతా జట్టు సొంతమైదానంలోనైనా విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో బోణీ కొట్టాలని ఎదురు చూస్తోంది. మరోవైపు ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ముంబయిని తొలి మ్యాచ్‌లోనే మట్టికరిపించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఘనంగా సీజన్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో కేకేఆర్, ఆర్‌సీబీ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా గురువారం మ్యాచ్‌ ప్రారంభమైంది. అందులో భాగంగా టాస్​ గెలుచుకున్న బెంగళూరు జట్టు బౌలింగ్​​ ఎంచుకుంది. ప్రత్యర్థి కోల్​కతాకు బ్యాటింగ్​​ అప్పగించింది.

ఆర్‌సీబీ బ్యాటర్లు వర్సెస్ కేకేఆర్‌ బౌలర్లు
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులోని బ్యాటర్లను కేకేఆర్‌ బౌలర్లు ఏమాత్రం అడ్డుకోగలరో వేచి చూడాలి. ఎందుకంటే, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తిక్‌తో కూడిన ఆర్‌సీబీ బ్యాటింగ్‌ విభాగం పటిష్ఠంగానే ఉంది. ఆల్‌రౌండర్‌ బ్రాస్‌వెల్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ముంబయిపై అర్ధశతకం సాధించిన విరాట్‌ కోహ్లీ అదే ఫామ్‌ను కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

కోల్‌కతా బౌలర్లు సునీల్ నరైన్ , ట్రెంట్‌ బౌల్ట్, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్, శార్దూల్‌ ఠాకూర్‌తో కూడిన బౌలింగ్ దళం ఉన్నప్పటికీ.. తొలి మ్యాచ్‌లో వరణ్‌, ఉమేశ్‌ మినహా మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించారు. కేకేఆర్‌ బ్యాటింగ్ విభాగం గొప్పగా ఏమీ లేదు. కెప్టెన్ నితీశ్ రాణా, గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రూ రస్సెల్‌ పరుగులు చేస్తున్నా కీలక సమయాల్లో పెవిలియన్‌కు చేరడం అభిమానులకు నిరాశకు గురి చేసింది. కీలకమైన రెండో మ్యాచ్‌లో అన్ని విభాగాలు నాణ్యమైన ప్రదర్శన ఇస్తేనే ఆర్‌సీబీపై విజయం సాధించేందుకు అవకాశాలు ఉంటాయి.

హెడ్​ టూ హెడ్​
కోల్‌కతా, బెంగళూరు జట్లు 30 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. అందులో కోల్‌కతానే 16 సార్లు విజయం సాధించగా.. బెంగళూరు 14 మ్యాచుల్లో గెలిచింది. బెంగళూరు మీద 222 పరుగులు సాధించగా.. అత్యల్పంగా 84 పరుగులు చేసింది. కేకేఆర్‌పై ఆర్‌సీబీ అత్యధికంగా 213 పరుగులు చేసింది. అయితే, కేకేఆర్‌ బౌలర్ల దెబ్బకు ఆర్‌సీబీ 49 పరుగులకే కుప్పకూలింది. గత సీజన్‌లో ఒకసారి తలపడగా.. బెంగళూరు విజయం సాధించింది. ఈసారి మ్యాచ్‌లో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే స్పిన్నర్లకు సహకారం లభిస్తుందనేది అంచనా.

ABOUT THE AUTHOR

...view details