ఐపీఎల్ 2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి.. కోల్‌కతాకు 229 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటర్ హ్యారీ బ్రూక్(100*) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి.. సెంచరీ పూర్తి చేశాడు. ఐదెన్ మార్క్రమ్ (50) హాఫ్ సెంచరీతో చెలరేగి పోయాడు. అభిషేక్ శర్మ(32) ఫర్వాలేదనిపించగా.. రాణిస్తారనుకున్న మయాంక్ అగర్వాల్(9), రాహుల్ త్రిపాఠి(9) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. క్లాసెన్(15*) పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ 3 వికెట్లు తీసి అదరగొట్టాడు. వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశాడు.
సీజన్లో ఫస్ట్ సెంచరీ.. హ్యారీ బ్రూక్ ఘనత..
వైఫల్యాలను దాటుకుంటూ.. భారీ స్కోర్ సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. మెరుపు షాట్లతో బ్యాటర్లు.. కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చుపించారు. అందులోనూ ఓపెనర్ హ్యారీ బ్రూక్.. వన్ మ్యాన్ షో చూపించాడు. మ్యాచ్ ఆది నుంచి అంతం వరకు బౌండరీలతో మొత మోగించాడు. 12 ఫోర్లు, 3 సిక్సులతో.. 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో మొదటి సెంచరీ సాధించిన ప్లేయర్‌గా రికార్డు నమోదు చేశాడు. మార్క్రమ్ కూడా దాదాపు 190 స్ట్రైక్ రేట్‌తో చెలరేగిపోయాడు. ఇద్దరు దాదాపు సమానమైన స్ట్రైక్ రేటుతో విధ్వంసకర ప్రదర్శన చేస్తూ.. ప్రేక్షకుల హార్ట్ బీట్ పేరిగేలా చేశారు. చివర్లో క్లాసెన్ కూడా 225 స్ట్రైక్ రేటుతో మెరుపు షాట్లు ఆడాడు.