తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 LSG VS RCB : ఆర్సీబీ టీమ్​లోకి ధోనీ ఫ్రెండ్​!

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టులోకి సీఎస్కే కెప్టెన్ ధోనీ ఫ్రెండ్​ జాయిన్ అయ్యాడు. గత మ్యాచ్​లో గాయపడిన డేవిడ్‌ విల్లేకు రీప్లేస్‌మెంట్‌గా అతడిని తీసుకుంది ఆర్సీబీ. ఆ వివరాలు..

IPL 2023 LSG VS RCB  Kedar Jadhav joins in RCB squad replaces David Willey
IPL 2023 LSG VS RCB : ఆర్సీబీ టీమ్​లోకి ధోనీ ఫ్రెండ్​!

By

Published : May 1, 2023, 7:25 PM IST

Updated : May 1, 2023, 10:11 PM IST

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టులోకి కొత్త సభ్యుడిని చేర్చుకుంది. చెన్నై సూపర్ కింగ్స్​ కెప్టెన్​ మహేంద్రసింగ్‌ ధోనీ స్నేహితుడైన, మాజీ సీఎస్కే ప్లేయర్​ కేదార్‌ జాదవ్‌ను తమ జట్టులోకి తీసుకుంది. గత మ్యాచులో గాయపడిన డేవిడ్‌ విల్లేకు రీప్లేస్‌మెంట్‌గా జాదవ్‌ను చోటు ఇచ్చింది. ఈ విషయాన్ని బెంగళూరు యాజమాన్యం సోషల్​మీడియా ట్వీట్ చేసింది. వాస్తవానికి 38 ఏళ్ల జాదవ్‌ను ఐపీఎల్‌ వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే అతడిని ఆర్సీబీ కోటి రూపాయలు ఖర్చు చేసి సొంతం చేసుకుంది.

కాగా, 2010లో ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు జాదవ్‌. తన ఐపీఎల్ కెరీర్​లో కొచ్చి టస్కర్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్​, సన్‌రైజర్స్‌ హైదరాబాద్​ తరఫున 93 మ్యాచులు ఆడాడు. ఇప్పటివరకు 123.17 స్ట్రైక్‌ రేట్‌తో 1,196 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో 2016, 2017 సీజన్​లలో బెంగళూరు తరఫున 17 మ్యాచ్‌లు ఆడాడు. 143.54 స్ట్రైక్​ రేట్‌తో 267 పరుగులు చేశాడు. దీంతో జాదవ్​ను జట్టులోకి తీసుకుంటే.. ఆర్సీబీ బ్యాటింగ్‌ బలపడుతుందనే ఆలోచనతో ఫ్రాంచైజీ. ఇకపోతే ఈ జట్టు మిడిల్ ఆర్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాప్ ఆర్డర్ బాగా రాణిస్తున్నప్పటికీ మిడిల్ ఆర్డర్ దారుణంగా ఫెయిల్ అవుతోంది. ప్రతి మ్యాచులో ఇదే సీన్ రిపీట్ అవుతోంది. టాప్ ఆర్డర్ ప్లేయర్లు కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్ వెల్.. మాత్రమే ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో రాణిస్తూ పరుగులు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు కేదార్ జాదవ్​.. జట్టులోకి రావడం వల్ల కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌(కేజీఎఫ్​) పై భారం తగ్గొచ్చని ఆర్సీబీ భావిస్తోంది.

కాగా, జాదవ్‌ స్పిన్‌ బౌలర్‌గా కూడా రాణించగలిగే సత్తా కూడా ఉంది. కానీ ఐపీఎల్‌లో అతడెప్పుడు బౌలింగ్‌ చేయలేదు. అతడు మంచి వికెట్‌కీపర్‌ కూడా. సీఎస్కే కెప్టెన్​ ధోనీతో అతడికి మంచి స్నేహం ఉందని క్రికెట్‌ వర్గాల్లో అంటుంటారు. అప్పట్లో మహీనే స్వయంగా... సీఎస్కే యాజమాన్యాన్ని ఒప్పించి మరీ టీమ్​లోకి తీసుకున్నాడని కూడా చెబుతుంటారు. ఇక తాజా ఐపీఎల్​ సీజన్​లో బెంగళూరు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో 4 విజయాలను ఖాతాలో వేసుకుంది. పాయింట్స్​ టేబుల్​లో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం నేడు (మే 1న) లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌తో పోటిపడుతోంది. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. మరి ఈ మ్యాచ్​ తుది జట్టులోకి జాదవ్​ను తీసుకోలేదు.

ఇదీ చూడండి:ipl 2023 worst players : సగం టోర్నీ పూర్తైంది.. ఎప్పుడు సార్​ ఆట మొదలెట్టేది

Last Updated : May 1, 2023, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details