ఐపీఎల్ 16వ సీజన్‌ను గాయాల రూపంలో షాక్‌లు వెంటాడుతూనే ఉన్నాయి. సీజన్ మొదలయ్యాక ఇప్పటికే గుజరాత్ టీమ్‌కు కేన్ మామ దూరం కాగా రాజస్థాన్ టీమ్‌లో నుంచి మరో ప్లేయర్ ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 7న దిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న తమ తదుపరి మ్యాచ్‌కు రాజస్థాన్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అసలేం జరిగింది..ఐపీఎల్-2023లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో 5 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా బట్లర్ చేతి వేలుకు గాయమైంది. దాని వల్ల అతను ఇన్నింగ్స్ ఓపెనింగ్ సమయంలో బ్యాటింగ్‌కు కూడా రాలేకపోయాడు. ఇక అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఓపెనర్‌గా రంగంలోకి దిగాడు. అయితే ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బట్లర్ క్రీజులో కాస్త ఇబ్బంది పడుతూ కనిపించాడు. అయినప్పటికీ 19 పరుగులు స్కోర్ చేసి పర్వాలేదనిపించాడు.
మరోవైపు బట్లర్ ప్రస్తుతం పూర్తీ ఫిట్‌గా లేనట్లు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్ సమయంలో తెలిపాడు. ఇక చేతి వేలు గాయంతో బాధపడుతున్న బట్లర్‌కు దిల్లీతో జరగనున్న మ్యాచ్ సమయంలో విశ్రాంతి ఇవ్వాలని ఫ్రాంచైజీ మెనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా అతని స్థానంలో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ డోనవాన్ ఫెరీరాకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.
కాగా, బుధవారం సాయంత్రం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. రాజస్థాన్ ఓపెనర్లు నిరాశపరిచారు. యశస్వి(11) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ రవిచంద్రన్ అశ్విన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్(19) దూకుడుగా ఆడేందుకు యత్నంచి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్(42).. జట్టు స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కానీ నాథన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. హెట్మెయర్ 36, ధ్రువ్ జురెల్ 32 పరుగులు చేసి పోరాడినా రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. పంజాబ్ బౌలర్ నాథన్ ఎల్లిస్ 4 వికెట్లు తీసి రాజస్థాన్ జట్టు పతనాన్ని శాసించాడు.
ఇదీ చదవండి: