తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 MI VS PBKS : జితేశ్‌ శర్మ విధ్వంసం.. మ్యాచ్​లో నమోదైన రికార్డులివే - ఐపీఎల్ 2023 జితేశ్ శర్మ రికార్డ్స్​

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ 2023 సీజన్‌లో భాగంగా తాజగా జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఆ వివరాలు..

IPL 2023 Jitesh Sharma breaks some records in Mumbai indians punjab kings match
IPL 2023 MI VS PBKS : జితేశ్‌ శర్మ విధ్వంసం.. మ్యాచ్​లో నమోదైన రికార్డులివే

By

Published : Apr 23, 2023, 7:29 AM IST

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ 2023 సీజన్‌లో భాగంగా తాజగా జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ పోరులో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సామ్‌ కరన్‌(55; 29 బంతుల్లో 5×4, 4×6) , హర్‌ప్రీత్‌ సింగ్‌, జితేశ్‌ శర్మ(25; 7 బంతుల్లో 4×6)లు తమ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోశారు. వారి బ్యాటింగ్​ విధ్వంసానికి పలు రికార్డులు బద్దలయ్యాయి. మరి ఆ రికార్డులేంటో తెలుసుకుందాం..

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఏడు బంతు​ల్లోనే 25 పరుగులు చేసి.. పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 357.14 స్ట్రైక్‌రేట్‌తో అగ్ర స్థానంలో ఉన్నాడు. బానుక రాజపక్స 344.44 స్ట్రైక్‌రేట్‌తో 9 బంతుల్లో 31 రన్స్​, కేఎల్‌ రాహుల్‌ 318.75 స్ట్రైక్‌రేట్​తో 16 బంతుల్లో 51 రన్స్​, నికోలస్‌ పూరన్‌ 312.50 స్ట్రైక్‌రేట్​తో 8 బంతుల్లో 25*పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్​ టీమ్​ లాస్ట్​ సిక్స్​ ఓవర్స్​లో 109 రన్స్​ చేసింది. ఐపీఎల్‌ హిస్టరీలో చివరి ఆరు ఓవర్లలో పంజాబ్​ ఇన్ని పరుగులు చేయడం ఇదే తొలిసారి. మొత్తంగా పంజాబ్‌.. రెండో స్థానంలో ఉండగా.. ఫస్ట్ ప్లేస్​లో స్థానంలో ఆర్సీబీ ఉంది. ఆ జట్టు గుజరాత్‌ లయన్స్‌పై చివరి ఆరు ఓవర్లలో 126 పరుగులు చేసింది. ఇకపోతే 2020లో పంజాబ్‌ కింగ్స్‌పై ముంబయి.. 104 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ ప్లేయర్స్​ సామ్‌ కరన్‌-హర్‌ప్రీత్‌ బాటియాలు ఐదో వికెట్‌కు 92 పరుగులు నమోదు చేశారు. పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో ఐదో వికెట్‌కు.. ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. అగ్ర స్థానంలో డేవిడ్‌ మిల్లర్‌-రాజ్‌గోపాల్‌ సతీష్‌ జోడీ 130*పరుగులు జోడించారు.

పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జున్‌ తెందుల్కర్​ తన మూడో ఓవర్లో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ముంబయి ఇండియన్స్‌ తరపున ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా అర్జున్‌ తెందుల్కర్​ నిలిచాడు. ఒక ఓవర్​లో 35 పరుగులు ఇచ్చి ఫస్ట్ ప్లేస్​లో డేనియల్‌ సామ్స్‌ ఉన్నాడు. కేకేఆర్‌పై ఈ ప్రదర్శన చేశాడు.

ఇదీ చూడండి:IPL 2023 MI VS PBKS : అర్ష్‌దీప్‌ దెబ్బకు ముంబయికి నిరాశ.. పంజాబ్​ విజయం

ABOUT THE AUTHOR

...view details