తెలంగాణ

telangana

ETV Bharat / sports

GT vs RR : సంజు, హెట్​మెయర్​ మెరుపులు.. గుజరాత్‌పై రాజస్థాన్‌ విజయం - gujarath titans loss the match

IPL 2023 ​: ఐపీఎల్​ 2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్​, గుజరాత్​ టైటాన్స్​ మధ్య మ్యాచ్​ అదిరిపోయింది. ఇటు శాంసన్‌.. అటు హెట్‌మెయర్‌ దంచుడే దంచుడు. దీంతో రాయల్స్​ విజయం సాధించింది.

gt vs rr result IPL 2023
gt vs rr result IPL 2023

By

Published : Apr 16, 2023, 10:58 PM IST

Updated : Apr 17, 2023, 8:15 AM IST

ఇండియ్​ ప్రీమియర్ లీగ్​ 2023లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్‌... పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సంజూ శాంసన్(60; 32 బంతుల్లో 3×4, 6×6) , షిమ్రన్ హెట్‌మెయర్(56 నాటౌట్‌; 26 బంతుల్లో 2×4, 5×6) విధ్వంసంతో ఆశలు కోల్పోయిన మ్యాచ్‌లో... రాజస్థాన్‌ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యఛేదనలో తొలి 10 ఓవర్లకు 53 పరుగులే చేసిన రాజస్థాన్.. చివరికి మరో 4 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించింది. గుజరాత్‌ జట్టును 3 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.

అయితే లక్ష్య ఛేదనలో మాయ చేస్తాడనుకున్న రాయల్స్​ జట్టు ఓపెనర్​ యశశ్వి జైశ్వాల్​ 7 బంతుల్లో కేవలం 1 పరుగు చేసి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ జాస్​ బట్లర్​ కూడా 5 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చి న దేవదత్​ పడిక్కల్​ (26) స్కోర్ బోర్డును కదిలించాడు. ఇక, పడిక్కల్​ తర్వాత వచ్చి రియాన్​ పరాగ్​ (5) పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది రాజస్థాన్. ఆ సమయంలో క్రీజులో ఉన్న కెప్టెన్ సంజు శాంసన్‌ 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 60 పరుగులు, హెట్‌మయర్‌ 26 బంతుల్లో 2 ఫోర్లు, 5సిక్స్‌లతో 56 పరుగులు.. మెరుపు షాట్లతో చెలరేగిపోయారు. తమ విధ్వంసక ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. వీరు రషీద్‌ ఖాన్‌కు శాంసన్‌ చుక్కలు చూపించారు. 11వ ఓవర్లో ఇతడి బౌలింగ్‌లో ఓ సిక్స్‌ బాదిన శాంసన్‌.. అతడి తర్వాతి ఓవర్లోనూ వరుసగా మూడు సిక్స్​లు కొట్టేశాడు. అయితే కాసేపు ఆచితూచి ఆడిన హెట్‌మయర్‌.. జోసెఫ్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌ కొట్టాడు. ఇక 15వ ఓవర్లో శాంసన్‌ ఔట్‌ అవ్వగా.. చివరి 5 ఓవర్లలో రాయల్స్​కు 64 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో స్వేచ్ఛగా చెలరేగిపోయిన హెట్‌మయర్‌ సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించాడు. అతడి దెబ్బకు 16వ ఓవర్లో జోసెఫ్‌ 20 పరుగులు సమర్పించుకున్నాడు. 18వ ఓవర్లో రషీద్‌ 13 పరుగులు సమర్పించుకున్నాడు. 19వ ఓవర్లో జురెల్‌ సిక్స్‌, అశ్విన్‌ ఫోర్‌ సిక్స్‌ బాది ఔట్‌ అవ్వడం వల్ల.. రాజస్థాన్‌కు చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే ఫస్ట్​ బాల్​కు రెండు తీసిన హెట్‌మయర్‌.. తర్వాతి బంతికి సిక్స్‌ కొట్టి లక్ష్యాన్ని పూర్తి చేశాడు. గుజరాత్ బౌలర్లలో షమీ 3, రషీద్‌ఖాన్ 2, పాండ్య, నూర్ అహ్మద్‌లు చెరోవికెట్ తీశారు.

అంతకుముందు.. టాస్​ ఓడిపోయి బ్యాటింగ్​కు చేసిన గుజరాత్​.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. గుజరాత్​ బ్యాటర్​​ శుభ్​మన్​ గిల్​ (45; 34 బంతుల్లో 4×4, 1×6), , డేవిడ్​ మిల్లర్​ (46; 30 బంతుల్లో 3×4, 2×6) మెరిశారు. హార్దిక్​ పాండ్య (28; 19 బంతుల్లో 3×4, 1×6), సాయి సుదర్శన్ (20), అభినవ్​ మహోనహర్​ (27; 13 బంతుల్లో 3×6) ఫర్వాలేదనిపించారు. ఓపెనర్​ వృద్ధిమాన్​ సహా (4), రషీద్​ ఖాన్ (1), రాహుల్​ తెవాతియా (1*), అల్జారీ జోసెఫ్​ (0*) పరుగులు చేశారు. రాజస్థాన్​ బౌలర్లలో సందీప్ శర్మ (2) వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్​ బౌల్ట్​ (1), యుజువేంద్ర చాహల్, ఆడమ్​ జంపా​ ఒక్కో వికెట్ తీశారు.

ఇదీ చూడండి:గంగూలీతో కోల్డ్​వార్!.. విరాట్ సీరియస్ లుక్.. షేక్​హ్యాండ్ ఇచ్చుకోకుండానే..

Last Updated : Apr 17, 2023, 8:15 AM IST

ABOUT THE AUTHOR

...view details