తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 : ముంబయిని అక్కడే ఆపండి.. ఫైనల్​కు వస్తే ఇక అంతే సంగతులు! - ఐపీఎల్​ 2023 క్వాలిఫయర్స్​ 2

IPL 2023 Final Match : ముంబయి ఇండియన్స్​ ఐపీఎల్​ చిత్రలోనే అత్యంత విజయవంతమైన టీమ్​. ఈ జట్టు ఇప్పటివరకు ఐదుసార్లు ఛాంపియన్​గా నిలిచింది. ఇప్పుడు ఆరోసారి టైటిల్​ ముద్దాలాడని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో ముంబయిని ఫైనల్​కు వెళ్లకుండా క్లాలిఫయర్​ 2లో గుజరాత్​ ఆపాలని.. ఫైనల్​కు వెళ్తే మాత్రం ముంబయి గెలుస్తుందని అభిమానులు అంటున్నారు. ఈ జట్టు రికార్డులు కూడా అదే చెబుతున్నాయి. మరి అలాంటి ముంబయి ఫైనల్​కు వెళ్తే ఎమవుతుందో తెలుసుకుందాం.

IPL 2023 Final Match mumbai indians
IPL 2023 Final Match mumbai indians

By

Published : May 25, 2023, 2:01 PM IST

IPL 2023 Final Match : ఐపీఎల్ 16వ సీజన్​ చివరి దశకు వచ్చింది. దాదాపు రెండు నెలలపాటు ప్రేక్షకులను అలరించిన ఈ టోర్నీ ఫైనల్​ పోరుకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఫైనల్​కు దూసుకెళ్లిన చెన్నై టైటిల్​ మీద కన్నేసింది. మరో బెర్త్​ కోసం క్వాలిఫయర్​ 2లో గుజరాత్, ముంబయి జట్లు హోరాహోరీగా శుక్రవారం తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్​లో అత్యంత విజయవంతమైన ముంబయి ఇండియన్స్​ జట్టుపై చర్చ జరుగుతోంది. ఆ జట్టు రికార్డులు తిరగేస్తున్నారు నెటిజన్లు. ముంబయి ఫైనల్​కు వెళ్తే మాత్రం పక్కా టైటిల్​ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు.

ఈ అభిప్రాయంలో నిజం లేకపోలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్​ మొదలైన అయిన 2008 నుంచి ఇప్పటివరకు ఆరు సార్లు ఫైనల్​కు వెల్లింది ముంబయి జట్టు. అందులో ఐదు సార్లు జయకేతనం ఎగురవేసి టైటిల్​ ముద్దాడింది. ఈ జట్టు ఫైనల్​కు వచ్చిందంటే కప్పు కొట్టడం ఖాయం. లేకపోతే సీజన్ లీగ్​ స్టేజ్​లోనే ఇంటిముఖం పట్టే అలవాటుంది ఈ జట్టుకు. 2008,09 సీజన్లలో లీగ్​ స్టేజీలోనే నిష్క్రమించింది. ఆ తర్వాత 2010లో మొదటిసారి ఫైనల్​కు చేరిన ముంబయికి నిరాశ ఎదురైంది. చెన్నై చేతిలో 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2011,12 సీజన్లలో ప్లే ఆఫ్స్​ దశకు చేరుకున్నా.. ఫైనల్స్​కు వెళ్లలేకపోయింది. 2013లో చెన్నైను 23 పరుగులతో ఓడించి ప్రతీకారం తీర్చుకుంది ముంబయి. ఆ తర్వాత 2015, 2017లో టైటిల్​ గెలిచింది. ఇక, 2019, 2020 వరుసగా రెండు సార్లు విజయం సాధించింది. ఈ జట్టు రికార్డులను బట్టి చూస్తే ఈ సారి కూడా కప్పు కొట్టేటట్టే కనిపిస్తోంది.

IPL 2023 Qualifier 2 : ప్రస్తుతం ఐపీఎల్ సీజన్​ను​ ఓటములతో ఆరంభించింది ముంబయి. ఆర్​సీబీ, చెన్నై చేతిలో వరుసగా ఓటమిపాలైంది. ఆ తర్వాత పుంజుకుని హ్యాట్రిక్​ విజయం సాధించింది. అలా చివరి లీగ్​ మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై విజయం సాధించి.. నాలుగో జట్టుగా క్వాలిఫయర్​లోకి అడుగుపెట్టింది. అలా టైటిల్​ సాధించిన ఐదు సందర్భాల్లో నాలుగుసార్లు సీజన్‌లను ఓటములతోనే ఆరంభించింది. అయితే, క్వాలిఫయర్​ వస్తే.. ఈ జట్టుకు ఎక్కడ లేని బలం వస్తుంది. ప్రత్యర్థుల బలహీనతలను అంచనా వేసి సరైన వ్యూహంతో చివరి వరకు పోరాడుతుంది. ఇప్పుడు కూడా ఆరోసారి కట్టు కొట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. అందుకే ఈ సెకండ్​ క్వాలిఫయర్​లోనే గుజరాత్​.. ముంబయిని ఆపాలని చెన్నై అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే, చెన్నై జట్టుపై సులభంగా గెలవలేం. ఇప్పటివరకు సీఎస్​కే నాలుగు సార్లు టైటిల్​ గెలవగా.. ఐదు సార్లు ఫైనల్స్​కు వెళ్లింది. ఈ రెండు జట్లు ఫైనల్​లో నాలుగు సార్లు తలపడ్డాయి. 2010లో మొదటి సారి ఫైనల్​కు వచ్చిన ముంబయిని చెన్నై చిత్తు చేసింది. ఆ తర్వాత 2013, 2015, 2019లో చెన్నైపై జయ కేతనం ఎగురవేసి టైటిల్​ను ముద్దాడింది ముంబయి ఇండియన్స్​ టీమ్​. కాగా ఈ రెండు జట్లు ఐదోసారి ఫైనల్​ పోరులో తలపడితే ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.

ABOUT THE AUTHOR

...view details