IPL 2023 Qualifier 2 : దాదాపు రెండు నెలలుగా అభిమానులను అలరించిన ఐపీఎల్ 16వ సీజన్.. చివరి దశకు చేరుకుంది. ఫైనల్లో సమరంలో అడుగుపెట్టేందుకు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ముంబయి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. టాస్కు ముంది కొద్దిగా వర్షం పడింది. కొద్ది సేపటి తర్వాత పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను ప్రారంభించారు.
IPL 2023 Qualifier 2 Pitch Report : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. అలాగే మంచి పేస్, బౌన్స్ లభించే పిచ్‌ను రూపొందించినట్లు సమాచారం. అయితే టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశముంది. ఛేజింగ్‌లో మంచు ప్రభావం పెద్దగా పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు : వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమి
ఇంపాక్ట్ ప్లేయర్లు :జాషువా లిటిల్, శ్రీకర్ భరత్, ఓడియన్ స్మిత్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, శివమ్ మావి
ముంబయి ఇండియన్స్ తుది జట్టు : ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూశ్ చావ్లా, జేసన్ బెరన్‌డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్
ఇంపాక్ట్ ప్లేయర్లు : రమణ్‌దీప్ సింగ్, విష్ణు వినోద్, నెహాల్ వధెరా, సందీప్ వారియర్, రాఘవ్ గోయల్
ఈ క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు మే 28న చైన్నైతో ఫైనల్లో తలపడతుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే.. వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక ముంబయి విజయం సాధిస్తే ఏడోసారి ఫైనల్‌కు వెళ్లిన జట్టుల్లో రెండు స్థానంలో నిలుస్తుంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్ ఆడుతుందా లేదా ముంబయి జట్టు ఏడోసారి ఫైనల్‌కు చేరుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.