#IPLFinal2023 CSK vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభంలో శుభ్ మాన్ గిల్ మరోసారి సెంచరీతో అదరగొడతాడా, సాహా రెచ్చిపోతాడా లేదా కెప్టెన్ హార్దిక్ పాండ్యా హార్డ్ హిట్టింగ్ చేస్తాడా అనే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడగా.. వారి ఆలోచనలను పటాపంచలు చేస్తూ యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (96; 47 బంతుల్లో 8×4, 6×6) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి డౌన్‌లో వచ్చి రెచ్చినపోయిన సాయి సుదర్శన్ ఇన్నింగ్సే హైలైట్‌గా నిలిచింది. కేవలం 47 బంతులను ఎదుర్కొన్న సుదర్శన్ 8 ఫోర్లు, 6 సిక్సర్లతో సీఎస్కే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఇన్నింగ్స్ రూపమే మారిపోయింది.
మొదట సైలెెంట్గానే బ్యాటింగ్ ప్రారంభించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఒక్కసారిగా గేర్లు మార్చి దూకుడు పెంచేశాడు. బాదుడే బాదుడు పెట్టుకున్నాడు. అలా 33 బంతుల్లో అర్ధసెంచరీ బాదిన సుదర్శన్.. ఒక్కసారిగా తన దూకుడు పెంచి చెన్నై బౌలర్లు బెంబేలెత్తించాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన 17వ ఓవర్‌లో వరుసగా 6,4,4,4 బాది.. స్కోరు బోర్డును యమ స్పీడుగా పరుగులు పెట్టించాడు. పతిరన వేసిన చివరి ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి సెంచరీకి చేరువయ్యాడు. అంతా అతడు శతకం బాదుతాడని ఆశించారు. కానీ, తర్వాతి బంతికే పతిరణ వేసిన యార్కర్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు.
IPL 2023 Final: సాయి సుదర్శన్ సర్ప్రైజ్ హిట్టింగ్.. హైలైట్ ఇదే! న్యాయం చేశాడు..
Sudarshan ipl 2023 : ఈ తమిళనాడు కుర్రాడు.. ఈ సీజన్ ప్రారంభంలోనూ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నైపై ఆడిన ఓ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి.. 179 పరుగుల ఛేదనలో ఆత్మవిశ్వాసంతో 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నోకియా, కుల్‌దీప్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఏ దశలోనూ తడబాటు లేకుండా అలవోకగా షాట్లు ఆడి ఆకట్టుకున్నాడు. కాగా, దేశవాళీల్లో తమిళనాడు తరఫున అదరగొట్టిన సుదర్శన్.. గత సీజన్లోనే రంజీల్లో అడుగుపెట్టాడు. 7 మ్యాచ్‌ల్లో 572 పరుగులు చేశాడు. దేశవాళీ వన్డే, టీ20 మ్యాచ్‌ల్లోనూ అతడికి మంచి రికార్డు ఉంది. అందుకే సుదర్శన్‌ను వేలంలో గుజరాత్.. కనీస ధర రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ ఇన్నింగ్స్‌లతో అతడు తనపై పెట్టిన పెట్టుబడికి న్యాయం చేశాడని చెప్పాలి.
CSK vs GT :ఇకపోతే సీఎస్కేతో జరుగుతున్న పైనల్ మ్యాచ్‌లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించింది. ఫస్ట్ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే మ్యాచ్ ప్రారంభదశలోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు(39; 20 బంతుల్లో 7×4) దీపక్ చాహర్ క్యాచ్ మిస్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గిల్.. హ్యాట్రిక్ బౌండరీలు, మెరుపు షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. కానీ అతడి వేగానికి రవీంద్ర జడేజా బ్రేక్ వేశాడు. అతడి బౌలింగ్‌లో ధోనీ(#MSDhoni) అద్భుతంగా స్టంపౌట్ చేసి పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత వృద్ధిమాన్ సాహా (54; 39 బంతుల్లో 5×4,1×6) ఇన్నింగ్స్‌ను తన భుజాలపై వేసుకున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య (21*, 12 బంతుల్లో 2×4) పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో పతిరన 2 వికెట్లు తీయగా... రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇదీ చూడండి:IPL Subhman gill : గిల్ రికార్డుల మోత.. కోహ్లీ తర్వాత అతడే!