తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 GT VS LSG : 'ఏంది కేఎల్ రాహుల్​.. ఇలానేనా ఆడేది.. దగ్గరుండి ఓడించావుగా' - కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫిక్సింగ్​ ట్రోల్స్​

గుజరాత్​ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో హాఫ్​సెంచరీతో జట్టులో టాప్​ స్కోరర్​గా నిలిచిన లఖ్​నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్​ను ఫ్యాన్స్​ ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. పేలవ ప్రదర్శనతో జట్టు ఓటమికి అతడు కారణమయ్యాడని అంటున్నారు. ఆ వివరాలు..

KL Rahul
IPL 2023 GT VS LSG : 'ఏంది కేఎల్ రాహుల్​.. ఇలానేనా ఆడేది.. దగ్గరుండి ఓడించావుగా'

By

Published : Apr 22, 2023, 10:22 PM IST

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​-2023 సీజన్​లో గుజరాత్‌ టైటాన్స్​​ - లఖ్​నవూ సూపర్​​ జెయింట్స్​ మ్యాచ్​ ఫ్యాన్స్​కు మంచి​ థ్రిల్లింగ్​ను ఇచ్చింది. అలాగే క్రికెట్​ అభిమానులెవరూ ఊహించని ఫలితం నమోదైంది. లాస్ట్​ బాల్​ వరకు సాగిన ఈ ఉత్కంఠ పోరులో గుజరాత్​ మోహిత్ శర్మ హీరోగా నిలిస్తే.. లఖ్​నవూ కేఎల్ రాహుల్ జోకర్ అయ్యాడు.

వాస్తవానికి 14 ఓవర్ల వరకు లఖ్​నవూ వైపే ఉన్న మ్యాచ్​​.. ఆఖరి ఐదు ఓవర్లలో ఊహించని మలుపు తిరిగి అభిమానులకు షాక్​ ఇచ్చింది. 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులతో బలంగా ఉన్న లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌.. మిగతా ఆరు ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగుల స్కోరు మాత్రమే చేసింది. ఓడిపోతుందనుకున్న గుజరాత్‌ టైటాన్స్​ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే లఖ్​నవూ బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌(68) పరుగులతో హాఫ్​ సెంచరీతో మెరిశాడు. జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే అదే రాహుల్‌.. మ్యాచ్‌ ఓటమికి కూడా కారణమయ్యాడు.

ఎలా అంటే.. ఛేదనకు దిగిన లఖ్​నవూ చేతిలో ఎనిమిది వికెట్లు.. 36 బంతుల్లో 31 పరుగులు చేస్తే విజయం. కానీ 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులతో ఆ జట్టు.. 15వ ఓవర్​లో 1 పరుగు, 16వ ఓవర్​లో 3, 17వ ఓవర్​లో 4, 18వ ఓవర్​లో 6, 19వ ఓవర్​లో 5, 20వ ఓవర్​లో 4 పరుగులు మాత్రమే చేసింది. ఇకపోతే మరోవైపు ఈ ఛేదనలో రాహుల్​.. అర్ధ శతకంతో ఆఖరి ఓవర్​ వరకు క్రీజులో నిలిబడ్డాడు. దీంతో అతడు మ్యాచ్‌ను గెలిపిస్తాడనే అంతా అనుకున్నారు. కానీ ఇక్కడ సీన్‌ ఒక్కసారిగా రివర్స్‌ అయింది. చివరి వరకు క్రీజులో ఉన్న రాహుల్‌.. అనూహ్యంగా చివరి ఓవర్‌ సెకండ్ బాల్​కు ఔట్​ అయ్యాడు. సులవుగా గెలిపించాల్సిన మ్యాచ్‌లో లఖ్​నవూకు ఓటమిని అందించాడు. 38 బంతుల్లో హాఫ్​ సెంచరీ చేసిన చేసిన అతడు.. తర్వాత 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అలా బంతులను మొత్తం వృథా చేశాడు. అదే సమయంలో గుజరాత్​ కట్టుదిట్టంగా బౌలింగ్​ వేయడంతో చివరి మూడు బంతుల్లో లఖ్​నవూ వరుసగా మరో మూడు వికెట్లను కోల్పోయింది. దీంతో కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ను సోషల్‌ మీడియాలో అభిమానులు, నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు.

ఈ పేలవ ప్రదర్శనతో ఐపీఎల్‌లో 60 బంతులు ఎదుర్కొని అత్యంత చెత్త స్ట్రైక్‌రేట్‌ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్‌ రాహుల్‌ చేరిపోయాడు. ఈ మ్యాచ్‌లో 61 బంతుల్లో 68 పరుగులు చేసిన రాహుల్‌ స్ట్రైక్‌రేట్‌ 111.48గా నమోదైంది. దీంతో అతడు ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఫస్ట్ ప్లేస్​లో జేపీ డుమిని 63 బంతుల్లో 59 పరుగులు(93.65 స్ట్రైక్​ రేట్​), సెకండ్ ప్లేస్​ ఆరోన్‌ ఫించ్‌ 62 బంతుల్లో 68 పరుగులు(109.68 స్ట్రైక్‌రేట్‌) ఉన్నారు.

ఇదీ చూడండి:IPL 2023 LSG VS GT : కేఎల్ రాహుల్​ అరుదైన రికార్డ్​.. కానీ ఉత్కంఠ పోరులో గుజరాత్​దే విజయం

ABOUT THE AUTHOR

...view details