తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023: అట్లుంటది మరి ధోనీతో.. ఆడింది 3 బాల్సే.. రికార్డ్ వ్యూవర్​ షిప్​!

ఐపీఎల్ 2023లో భాగంగా లఖ్​నవూతో జరిగిన మ్యాచ్​లో సీఎస్కే కెప్టెన్​ ధోనీ.. వ్యూవర్​ షిప్​ పరంగా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వివరాలు..

IPL 20223 Dhoni Record viewership
IPL 20223: అట్లుంటది మరి ధోనీతో.. ఆడింది 3 బాల్సే..

By

Published : Apr 4, 2023, 1:24 PM IST

Updated : Apr 4, 2023, 2:46 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లఖ్​నవూ సూపర్ జెయింట్స్‌తో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో రుతురాజ్​ గైక్వాడ్​(57; 31 బంతుల్లో 3×4, 4×6), ఓపెనర్​ డేవాన్‌ కాన్వే (47; 29 బంతుల్లో 5×4, 2×6) బాగా రాణించారు. అయితే ఈ మ్యాచ్​కు మరో హైలైట్​.. చివర్లో వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అదిరిపోయే సిక్సర్లు బాదడం. దాదాపు నాలుగేళ్ల(1426 రోజులు) తర్వాత చెపాక్‌ స్టేడియంలో ఆడిన ధోనీ.. తన విధ్వంసకర సిక్స్‌లతో చెలరేగాడు. చివరి ఓవర్​లో బ్యాటింగ్​కు వచ్చిన మహీ తొలి బంతినే సిక్సర్​గా మలిచాడు. రెండో బంతిని కూడా సిక్సర్​ బాది పాత ధోనీ మరోసారి గుర్తుచేశాడు. ఆ బంతి 89 మీటర్ల దూరంలో పడింది. అయితే మరో మూడో బంతిని కూడా సిక్సర్​ బాదాలని ప్రయత్నించి క్యాచ్​ ఔట్​ ఇచ్చాడు. అలా ఆడింది మూడు బంతులేనైనా తనదైన మార్క్​ను చూపించాడు.

అయితే ఈ సమయంలో ఐపీఎల్​ వ్యూవర్​షిప్​లో ఓ రికార్డు నమోదైంది. అప్పటి వరకు జియో సినిమాలో మ్యాచ్​ వీక్షకుల సంఖ్య సుమారు కోటి 50 లక్షలు ఉండగా.. మహీ బ్యాటింగ్ చేసిన మూడు బంతుల్లో కోటీ 80 లక్షలకు పెరిగింది. అంటే అతడు క్రీజులోకి రాగానే ఒక్కసారిగా 30 లక్షల సంఖ్య పెరిగింది. తాజా ఐపీఎల్​ సీజన్​లో ఇదే అత్యధిక వీక్షకుల సంఖ్య కావడం విశేషం. ఇక ఇదే సీజన్​లో సీఎస్కే తొలి మ్యాచ్​లో ధోనీ బ్యాటింగ్​ చేసినప్పుడు కోటీ 60 లక్షల మంది వీక్షించారు. అంటే తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడన్న మాట. ధోనీ బ్యాటింగ్‌కు ఫిదా అయిన సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే.. అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నాడు. ఇన్నింగ్స్ బ్రేక్‌లో జియో సినిమాతో మాట్లాడుతూ.. ధోనీ బ్యాటింగ్ ఎంతో అద్భుతం అని కొనియాడాడు.

కాగా, ఇదే మ్యాచ్​లో రెండు వరుస సిక్స్‌లను బాదిన ధోనీ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ ఇండియన్ ప్రీమియర్​ లీగ్​లో 5వేల పరుగుల మార్క్​ను అందుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో 20వ ఓవర్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. అతడు ఇప్పటి వరకు 20వ ఓవర్‌లో 55 సిక్స్‌లు బాదగా.. కీరన్ పొలార్డ్ 33 సిక్స్‌లను కొట్టాడు.

ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఫస్ట్​ బ్యాటింగ్​కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(31 బంతుల్లో 57; 3x4, 4x6), డెవాన్ కాన్వే(29 బంతుల్లో 47; 5 x4, 2x6) బ్యాట్​తో చెలరేగారు. లఖ్​నవూ బౌలర్లలో మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ తీశారు. మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్ చేసిన జట్టుగా సీఎస్కే రికార్డుకెక్కింది. ఇప్పటి వరకు 24 సార్లు 200 ప్లస్ స్కోర్ మార్క్​ను అందుకుంది.

ఇదీ చూడండి:ఇకపై అలా చేస్తే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటా.. బౌలర్లకు మహీ సీరియస్ వార్నింగ్​

Last Updated : Apr 4, 2023, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details