ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. 49 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. బ్యాటర్లు పోటీ పడి మరీ దుుమ్ముదులిపారు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. వెటరన్ ఆటగాడు, టెస్ట్ క్రికెటర్‌గా ముద్రపడ్డ అజింక్య రహానె ఇన్నింగ్స్ అయితే వేరే లెవెల్. టీ20లకు అస్సలు సెట్ కాడు అనుకున్న రహానెలో ఇంత ఉందా అని క్రికెట్ అభిమానులు అనుకునేలా ఆడాడు. మెరుపు షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. రహానెకు యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తోడయ్యాడు. ఆఖర్లో జడేజా సైతం రెండు సిక్సర్లు బాది తన మార్కు చూపించాడు.
అయితే ఈ మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన అజింక్య రహానెకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆ సమయంలో రహానె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బ్యాటింగ్‌లో దూకుడు పెరగడంపై స్పందిస్తూ.. ఇప్పుడేం చూశారు.. ముందుంది ముసళ్ల పండుగ, సినిమా చూపిస్తా.. అన్న రేంజ్‌లో కామెంట్స్ చేశాడు. ధోనీ భాయ్ నేతృత్వంలోనే తాను రాటుదేలానని, అతను చెప్పింది చేస్తే ఆటోమాటిక్‌గా మనలో ఆటకు తగ్గ మార్పులు వస్తాయని అన్నాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన అన్ని నాక్స్‌కు ఎంజాయ్ చేశానని, మున్ముందు ఇంకొంత దూకుడు పెంచేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు.