ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నాలుగుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్‌కింగ్స్.. ఇప్పుడు 16వ సీజన్లో బోణీ కొట్టింది. 12 పరుగుల తేడాతో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ను ఓడించింది. 218 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన లఖ్‌నవూలో.. మేయర్స్ ఉన్నంతసేపు ఛేదన కష్టమేమీ కాదనే అనిపించింది. తమ ఫస్ట్ మ్యాచ్‌లో దిల్లీపై చెలరేగిపోయిన ఈ విండీస్ వీరుడు.. చెన్నై మీదా కూడా అదే దూకుడు ప్రదర్శించాడు. దొరికిన బంతిని దొరికినట్లుగా బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. మేయర్స్ దెబ్బకు 2-5 మధ్య ఓవర్లలో వరుసగా 18, 13, 18, 17 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకే స్కోరు 73కు చేరుకుంది. అయితే పవర్ ప్లే చివరి ఓవర్లో బంతిని అందుకున్న మొయిన్ అలీ మేయర్స్‌ను దూకుడును అడ్డుకున్నాడు. మేయర్స్‌ను మాత్రమే కాదు మిగతా వారిని ఔట్ చేశాడు. ఓవర్‌కో వికెట్ చొప్పున పడగొట్టాడు. రాహుల్ (20), కృనాల్ (9), స్టాయినిస్ (21) అతడికి వికెట్లు సమర్పించుకోవడంతో లఖ్‌నవూ లక్ష్యానికి దూరమైంది. ఉన్నంతసేపు ధాటిగా ఆడిన పూరన్ (32; 18 బంతుల్లో 2×4, 3×6) కాస్త ఆశలు రేపినా.. అతను ఔటయ్యాక లఖ్‌నవూ పనైపోయింది. బదోని (23), గౌతమ్ (17 నాటౌట్)ల పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
అంతకుముందు టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (57; 31 బంతుల్లో 3×4, 4×6) మెరుపులు మెరిపించాడు. మరో ఓపెనర్ డేవాన్ కాన్వే (47; 29 బంతుల్లో 5×4, 2×6) రాణించాడు. శివమ్ దూబె (27) క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. చివర్లో అంబటి రాయుడు (27) పర్వాలేదనంపించాడు. బెన్స్టోక్ట్స్, జడేజా నిరాశపరిచారు. ఆఖర్లో ధోనీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోనీ 2 సిక్స్‌లతో 12 పరుగులు చేశాడు. లఖ్‌నవూ బౌలర్లో మార్క్‌వుడ్, బిష్ణోయ్ తలా మూడు వికెట్లు సాధించగా.. ఆవేశ్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.అవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.