చెన్నై చెపాక్ స్డేడియం అంతా పసుపు మయంగా మారింది. ధోనీ సేన అభిమానులు కేరింతలతో స్టేడియం హోరెత్తింది. అయితే ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా.. ఆ స్టేడియంలో నాలుగేళ్ల మ్యాచ్ జరుగుతోంది. లఖ్‌నవూతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై టీమ్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. ప్రత్యర్థి లఖ్‌నవూ జట్టుకు 218 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్(57) మెరుపు షాట్లతో అలరించాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. మరో ఓపెనర్ కాన్వే కూడా రాణించాడు. శివమ్, మెయిన్ అలీ, అంబటి రాయుడు పర్వాలేదనిపించారు. బెన్స్టోక్ట్స్, జడేజా నిరాశపరిచారు. ఆఖర్లీ ధోనీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని 2 సిక్స్‌లతో 12 పరుగులు చేశాడు. లఖ్‌నవూ బౌలర్లో మార్క్వుడు, బిష్ణోయ్ తలా మూడు వికెట్లు సాధించగా.. ఆవేశ్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
ధోనీ@5000
ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోనీ.. అరుదైన ఘనతను సాధించాడు. లీగ్ చరిత్రలో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఏడో ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. బెస్ట్ ఫినిషనర్గా పేరు సంపాదించిన మహి.. లీగ్ చరిత్రలో 20వ ఓవర్‌లో 277 బంతుల్లో 49 ఫోర్లు, 55 సిక్సర్లతో బాదాడు.